
ముంబై చేరుకున్న సీఎస్కే టీం
ఇక ఈ మెగా టోర్నీ కోసం మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నైసూపర్ కింగ్స్ ఐపీఎల్ 2022 వేదికైనా ముంబై చేరుకుంది. ఇక బుధవారం నుంచి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టనుంది. దీంతో సీఎస్కే ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. గతేడాది ట్రోఫి గెలుచుకున్న చెన్నైసూపర్ కింగ్స్ ఈ సారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. అంతేకాకుండా ఇప్పటికే నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న ఎల్లో ఆర్మీ ఈ సారి ఐదో ట్రోఫిని కూడా గెలుచుకుని అత్యధికంగా 5 టైటిళ్లు గెలిచిన ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేయాలని భావిస్తోంది.

కేకేఆర్‌తో ఫస్ట్ మ్యాచ్
ఇక చెన్నైసూపర్ కింగ్స్ టోర్నీ ఆరంభ మ్యాచ్‌తోనే తమ జర్నీని ప్రారంభించింది. గత సీజన్లో ఫైనల్ చేరిన కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నైసూపర్ కింగ్స్ ఈ నెల 26న జరగనున్న టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో తలపడనున్నాయనే సంగతి తెలిసిందే. కాగా కరోనా కారణంగా ఈ సారి ఐపీఎల్ మ్యాచ్‌లన్నింటిని ముంబైలోని 4 వేదికలలోనే నిర్వహిస్తున్నారు. దీంతో టీంలన్నీ మ్యాచ్‌ల కోసం ఒక్కొక్కటిగా ముంబై చేరుకుంటున్నాయి. టీంలన్నింటికీ హోం టీమైనా ముంబై ఇండియన్స్ ఘనంగా వెల్‌కమ్ చెబుతోంది. కాగా ముంబై చేరుకోవడానికి ముందే సూరత్‌లో చెన్నైసూపర్ కింగ్స్ అన్ని జట్ల కంటే ముందుగానే ప్రాక్టీస్ ప్రారంభించింది. ఆ ప్రాక్టీస్ క్యాంపులో అందుబాటులో ఉన్న ఆటగాళ్లంతా పాల్గొని సాధన చేశారు.

మొయిన్ అలీ డౌటే
కాగా వీసా సమస్యలతో చెన్నైసూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఇంకా భారత్ చేరుకోలేదు. దీంతో అతను తొలి మ్యాచ్‌కు దూరం కావడం ఖాయంగా కనిపిస్తోంది. అలీ వీసా సమస్యలను క్లియర్ చేయడానికి ఇటు సీఎస్కే మేనేజ్‌మెంట్‌తోపాటు అటు బీసీసీఐ కూడా ప్రయత్నిస్తోంది.


చెన్నైసూపర్ కింగ్స్ పూర్తి స్క్వాడ్ 2022
మహేంద్ర సింగ్ ధోనీ (12 కోట్లు), రవీంద్ర జడేజా(16 కోట్లు), మొయిన్ అలీ 8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్( 6 కోట్లు), దీపక్ చాహర్( 14 కోట్లు), అంబటి రాయుడు(6.75 కోట్లు), డ్వేన్ బ్రావో (ఓవర్సీస్-4.40 కోట్లు), శివమ్ దూబే( 4 కోట్లు), క్రిస్ జొర్డాన్( 3.60 కోట్లు), రాబిన్ ఉతప్ప(2 కోట్లు), మిచెల్ సాంట్నర్ (ఓవర్సీస్ 1.90కోట్లు), ఆడమ్ మిల్నే (ఓవర్సీస్- 1.90 కోట్లు), విక్రమ్ సోలంకి(1.20 కోట్లు), రాజ్‌వర్థన్(1.50 కోట్లు), డేవన్ కాన్వే (ఓవర్సీస్- రూ. కోటి), మహీష్ తీక్షణ (ఓవర్సీస్ 70 లక్షలు), ప్రిటోరియస్ (ఓవర్సీస్ 50 లక్షలు), కేఎమ్ అసిఫ్, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్, శుభ్రాన్ష్ సేనాపతి, ముకేశ్ చౌధరి, జగదీశన్, హరి నిషాంత్( వీరందరికీ 20 లక్షలు)


Click it and Unblock the Notifications












