Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చాంపియన్స్ లీగ్: సెమీ ఫైనల్ లో ధోనీ చెన్నై సూపర్ కింగ్స్

Mahendra Singh Dhoni
పోర్ట్‌ ఎలిజబెత్‌: చాంపియన్స్ లీగ్ టి - 20 టోర్నమెంట్ లో మరో ఐపీఎల్ జట్టు సెమీస్ కు చేరింది.బుధవారం వారియర్స్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో 10 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ సెమీస్ కు చేరింది. ఇప్పటికే బెంగళూరు రాయల్స్ చాలెంజర్స్ చేరిన సంగతి తెలిసిందే. ఫైనల్లో చోటు కోసం బెంగళూరుతో పోటీకి చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధమైంది. సెమీస్‌ చేరాలంటే బుధవారం తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌ లో తక్కువ స్కోరే చేసినా ధోనీసేన గొప్ప పోరాటపటిమను ప్రదర్శించింది. మైకెల్‌ హసి (50), విజయ్‌ (35) రాణించడంతో మొదట 6 వికెట్లకు 136 పరుగులు చేసిన చెన్నై..వారియర్స్‌ ను 126 (8 వికెట్లకు) పరుగులకే కట్టడి చేసింది. స్పిన్నర్లు అశ్విన్‌ (3/24), మురళీధరన్‌ (2/17), జకాతి (1/27) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. జాకబ్స్‌ (32) టాప్‌ స్కోరర్‌. ఈ మ్యాచ్‌ ఫలితంతో గ్రూపులో చెన్నై, వారియర్స్‌, విక్టోరియా 6 పాయింట్లతో (3 విజయాలు) సమంగా నిలిచాయి. ఐతే మెరుగైన రన్‌రేట్‌తో తొలి రెండు స్థానాల్లో నిలిచిన చెన్నై, వారియర్స్‌ సెమీస్‌కు అర్హత సాధించాయి. గ్రూప్‌ 'ఎ'లో అగ్రస్థానంలో ఉన్న చెన్నై శుక్రవారం జరిగే తొలి సెమీస్‌లో గ్రూప్‌ 'బి'లో రెండో స్థానంలో నిలిచిన బెంగళూరుతో తలపడుతుంది.

శుభారంభమే కానీ..: కీలకమైన మ్యాచ్‌లో చెన్నై అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. విజయ్‌ (35; 27 బంతుల్లో 3X4, 2X6), మైకెల్‌ హసి (50; 39 బంతుల్లో 4X4, 1X6) తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించి శుభారంభాన్నందించారు. విజయ్‌ తనదైన శైలిలో చక్కని షాట్లు కొట్టాడు. సొత్సోబ్‌ బౌలింగ్‌లో సిక్స్‌ బాదాడు. బోయే వేసిన ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్లో సిక్స్‌, ఫోర్‌ కొట్టాడు. హసి కూడా ఫోర్‌ సాధించడంతో ఆ ఓవర్లో 16 పరుగులొచ్చాయి. 8.3 ఓవర్లలో స్కోరు 63. వికెట్లన్నీ చేతిలో ఉండడంతో చెన్నై మంచి స్కోరు చేయడం ఖాయమనిపించింది. కానీ ధోనీసేన అనూహ్యంగా మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. క్రెచ్‌ (3/19), థెరాన్‌ (1/16), బోథా (1/27) అద్భుతంగా బౌలింగ్‌ చేసి చెన్నైని దెబ్బతీశారు. భాగస్వామ్యాలు నమోదు కాకుండా వెంటవెంటనే వికెట్లు తీస్తూ..స్కోరు వేగాన్ని బాగా తగ్గించారు. కట్టుదిట్టమైన బౌలింగ్ ‌తో బ్యాట్స్‌మెన్‌ను ఏమాత్రం స్వేచ్ఛగా ఆడనివ్వలేదు. భారీషాట్లు కొట్టనివ్వలేదు. ప్రతి పరుగుకూ చెమటోడ్చేలా చేశారు.

వారియర్స్‌కు తొలి వికెట్‌ను అందించింది క్రెచ్‌. విజయ్‌ని బౌల్డ్‌ చేసి చెన్నై పతనానికి నాంది పలికాడు. ఆ తర్వాత చెన్నై ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. రైనా (6) కూడా వెంటనే క్రెచ్‌కు వికెట్‌ సమర్పించుకున్నాడు. అప్పటికి స్కోరు 89. 99 అయ్యేసరికి హసి, బద్రీనాథ్‌ (2) వెనుదిరిగారు. 15 ఓవర్లకు స్కోరు 101/4. అనిరుద్ధ, కెంప్‌ కూడా విఫలమైనా..ఆఖర్లో ధోనీ (31 నాటౌట్‌; 21 బంతుల్లో 2X4, 1X6) శ్రమించడంతో చెన్నై ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. చివరి ఐదు ఓవర్లలో చెన్నై చేసింది 35 పరుగులే. వీటిలో 19వ ఓవర్లో వచ్చినవే 17. చెన్నై ఇన్నింగ్స్‌ మొత్తంలో ఏడు ఓవర్లలో మాత్రమే ఆరుకన్నా ఎక్కువ పరుగులొచ్చాయి.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+