సీఎస్కేకు బిగ్ షాక్.. ప్లేఆఫ్ రేసు వేళ స్టార్ ఆల్‌రౌండర్ దూరం!
IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా కొనసాగుతున్న తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ గాయం కారణంగా ప్రస్తుత సీజన్ నుంచి తప్పుకున్నారు. తొడ గాయంతో బాధపడుతున్న జేమీ ఓవర్టన్.. తదుపరి చికిత్స, వైద్య పరీక్షల కోసం బుధవారం యూకేకు బయలుదేరి వెళ్లాడు. ఈ విషయాన్ని సీఎస్కే ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. కీలకమైన మ్యాచ్‌లు ఉన్న సమయంలో జేమీ ఓవర్టన్ జట్టుకు దూరం కావడం సీఎస్కే అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ సీజన్లో జేమీ ఓవర్టన్ సీఎస్కే విజయావకాశాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లలో జేమీ ఓవర్టన్ 14 వికెట్లు పడగొట్టడమే కాకుండా బ్యాటింగ్‌లోనూ 136 పరుగులు చేసి జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ రాణిస్తున్న జేమీ ఓవర్టన్ అకస్మాత్తుగా తప్పుకోవడం వల్ల జట్టు యాజమాన్యం ఇప్పుడు ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతోంది. "జేమీ ఓవర్టన్ కుడి తొడ గాయం నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వెళ్తున్నాడు" అని సీఎస్కే తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొంది.

వాస్తవానికి ఈ సీజన్‌లో సీఎస్కే జట్టును గాయాల బెడద వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సేవలను కోల్పోయిన సీఎస్కే.. మధ్యలో టాపార్డర్ బ్యాటర్ ఆయుష్ మాత్రే, పేసర్ ఖలీల్ అహ్మద్‌లను కూడా గాయాల కారణంగా కోల్పోయింది. అలాగే ఆస్ట్రేలియా ఆటగాళ్లు నాథన్ ఎల్లిస్, స్పెన్సర్ జాన్సన్ కూడా ఈ ఏడాది అందుబాటులో లేరు. వరుసగా ఆటగాళ్లు గాయపడటం ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన సీఎస్కేకు పెద్ద సవాలుగా మారింది.
గాయపడిన మహారాష్ట్ర ఆల్‌రౌండర్ రామకృష్ణ ఘోష్ స్థానంలో కర్ణాటకకు చెందిన మాక్నీల్ నోరోన్హాను జట్టులోకి తీసుకున్నట్లు సీఎస్కే వెల్లడించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న సీఎస్కేకు, ప్లేఆఫ్ చేరాలంటే రాబోయే మ్యాచ్‌లు అత్యంత కీలకం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సీఎస్కే మిగిలిన మ్యాచ్‌ల్లో ఎలా రాణిస్తుందో, కొత్త ఆటగాళ్లు జట్టును ఎలా ఆదుకుంటారో వేచి చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications