Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ సేనలో కీలక మార్పులు: తుదిజట్టులో ఆల్‌రౌండర్‌కు చోటు: కేన్ మామకు కలిసొస్తుందా?

Chennai Super Kings Playing 11 vs SRH: Dwayne Bravo Out And Sam Curran In For Match 44
IPL 2021 : Jason Roy ఫామ్‌ చూసి హడల్, బరిలోకి ఆ ఆల్‌రౌండర్‌ SRH VS CSK | Playoffs | Oneindia Telugu

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్‌లో మరో కీలక మ్యాచ్ ఈ సాయంత్రం ఆరంభం కానుంది. టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్.. తలపడనున్నాయి. షార్జా క్రికెట్ స్టేడియం దీనికి వేదిక కానుంది. ధోనీసేనతో పోల్చుకుంటే.. ఈ మ్యాచ్‌ను గెలిచి తీరాల్సిన అవసరం సన్‌రైజర్స్ ఉంది. ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే విజయకేతనం ఎగురవేయక తప్పదు.

ఆ చేదు జ్ఞాపకాలకు..

ఆ చేదు జ్ఞాపకాలకు..

ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతంగా రాణిస్తోంది. అంచనాలకు మించిన స్థాయిలో సత్తా చాటుతోంది. ప్రస్తుతం టేబుల్ టాపర్‌గా ఉందీ టీమ్. ప్లే ఆఫ్ ముంగిట్లో నిలిచింది. సన్‌రైజర్స్‌పై మ్యాచ్ గెలిస్తే.. దర్జాగా ప్లే ఆఫ్ ఎంట్రీ ఇస్తుంది. ప్లే ఆఫ్స్‌లో ప్రవేశించిన మొట్టమొదటి జట్టుగా నిలుస్తుంది. గత సీజన్‌లో ఇదే ఎమిరేట్స్ గడ్డ మీద ఎదుర్కొన్న అవమానకర పరాజయాల చేదు జ్ఞాపకాలను చెరిపేసుకోగలుగుతుంది. ఐపీఎల్ 2020 సీజన్‌లో ప్లే ఆఫ్ చేరకుండా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన మొట్టమొదటి జట్టు చెన్నై సూపర్ కింగ్సే.

ప్లే ఆఫ్ ముంగింట్లో..

ప్లే ఆఫ్ ముంగింట్లో..

ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ ముంగిట్లో నిలిచింది. చివరి అయిదు మ్యాచుల్లో నాలుగింట్లో అద్వితీయ విజయాలను అందుకుంది. ఇప్పటిదాకా 10 మ్యాచ్‌లను ఆడిన ధోనీ సేన రెండింట్లో మాత్రమే ఓడింది. ఆ జట్టు ఖాతాలో 16 పాయింట్లు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తాను ఆడిన చివరి మూడు మ్యాచులనూ గెలుచుకుంది. హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. ఈ సాయంత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఢీ కొనడానికి సమాయాత్తమౌతోంది. ఈ మ్యాచ్ గెలిస్తే.. అధికారికంగా ప్లే ఆఫ్ చేరిన మొదటి జట్టు అవుతుంది.

కీలక మ్యాచ్‌ కోసం జట్టులో మార్పు

కీలక మ్యాచ్‌ కోసం జట్టులో మార్పు

రాజస్థాన్ రాయల్స్ మీద సాధించిన విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీ కొట్టే విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ కొంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టే కనిపిస్తోంది. జేసన్ రాయ్‌ను, కేన్ విలియమ్సన్ వంటి టాప్ ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయడానికి.. వారి భారీ స్కోర్ చేయాల్సిన పరిస్థితే వస్తే- బ్యాటింగ్‌లో సత్తా చాటగల ఆల్‌రౌండర్‌ను బరిలోకి దించనుంది. ఆ ఆల్‌రౌండర్.. సామ్ కుర్రన్.

డ్వేన్ బ్రావో స్థానంలో..

డ్వేన్ బ్రావో స్థానంలో..

స్టార్ బౌలర్ డ్వేన్ బ్రావోను తదుపరి మ్యాచ్‌ల కోసం విశ్రాంతిని ఇచ్చి, అతని స్థానంలో సామ్ కుర్రన్‌ను తీసుకుంటారని తెలుస్తోంది. డ్వేన్ బ్రావో బౌలింగ్‌లో రాణిస్తున్నాడు. వంక పెట్టడానికి వీల్లేదు. ముంబై ఇండియన్స్‌పై మ్యాచ్‌లో 25 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు. ఎనిమిది బంతుల్లో 23 పరుగులు లాగించేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మ్యాచ్‌లోనూ సత్తాచాటాడీ విండీస్ వీరుడు. 24 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు.

వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్..

వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్..

సన్‌రైజర్స్ మాంఛి ఊపు మీద ఉన్నందున.. బ్యాటింగ్‌లోనూ ఆ జట్టు భారీ స్కోర్ చేయాల్సి వస్తే.. దాన్ని అందుకునేలా- సామ్ కుర్రన్‌ను జట్టులో తీసుకోవాలని భావిస్తోంది టీమ్ మేనేజ్‌మెంట్. ఓ ఆల్‌రౌండర్‌ను తీసుకోవాల్సిన అవసరం ఉందనే నిర్ణయానికి వచ్చింది. దీనితోపాటు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కింద డ్వేన్ బ్రావోకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ప్లేఆఫ్స్‌లోకి చేరడం లాంఛనప్రాయమే అయినందున.. ఆ మ్యాచ్‌ల కోసం బ్రావోను సిద్ధం చేసే ప్రయత్నంలో అతనికి రెస్ట్ ఇవ్వాలని జట్టు నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

జట్టు కూర్పు ఎలా ఉండొచ్చు..?

జట్టు కూర్పు ఎలా ఉండొచ్చు..?

అదొక్కటే తప్ప.. పెద్దగా మార్పులేవీ ఉండకపోవచ్చు. జట్టులో రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఎంఎస్ ధోనీ (కేప్టెన్ వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, సామ్ కుర్రన్ లేదా డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హేజిల్‌వుడ్‌ ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.

Story first published: Thursday, September 30, 2021, 14:46 [IST]
Other articles published on Sep 30, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+