CSK Playing XI vs MI: సామ్ కరన్ ఔట్.. డుప్లెసిస్ డౌట్! ముంబైతో బరిలోకి దిగే సీఎస్‌కే టీమ్ ఇదే!

హైదరాబాద్: ఐపీఎల్ 2021 మలిదశ లీగ్‌కు మరో 48 గంటల్లో తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ ధనాధన్ లీగ్ సందడి మొదలవ్వనుంది. అందరికన్నా ముందే అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో యూఏఈ చేరిన చెన్నై సూపర్ కింగ్స్.. టైటిలే లక్ష్యంగా ముమ్మరంగా సాధన చేస్తోంది. గత సీజన్ యూఏఈ గడ్డపై ఎదురైన పరాభావాలకు బదులు తీర్చుకోవాలనుకుంటుంది. పైగా మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని భావిస్తున్న తరుణంలో టైటిల్‌తో ఘనంగా వీడ్కోలు పలకాలనుకుంటుంది.

అయితే ఈ మెగా మ్యాచ్‌కు చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాళ్ల సేవలను కోల్పోయింది. ఆలస్యంగా యూఏఈకి వచ్చిన స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ దూరమవ్వగా.. గజ్జ గాయంతో బాధపడుతున్న డుప్లెసిస్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఢికొట్టడానికి సీఎస్‌కే ఏ కాంబినేషన్స్‌తో బరిలోకి దిగుతుందా? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

క్వారంటైన్‌లో సామ్ కరన్..

క్వారంటైన్‌లో సామ్ కరన్..

గత బుధవారమే ఇంగ్లండ్ నుంచి యూఏఈకి చేరుకున్న సామ్ కరన్ ప్రస్తుతం 6 రోజుల క్వారంటైన్ పాటిస్తున్నాడు. అతని క్వారంటైన్ సెప్టెంబర్ 21న ముగియనుంది. దాంతో అతను ముంబైతో జరిగే మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇక కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)2021లో గజ్జ గాయానికి గురైన డుప్లెసిస్ కూడా ఫస్ట్ మ్యాచ్ ఆడటం డౌటే. ఈ గాయంతోనే అతను సీపీఎల్‌లో కీలక సెమీస్‌తో పాటు ఫైనల్ మ్యాచ్ ఆడలేదు. గజ్జ గాయానికి సుదీర్ఘ విశ్రాంతి అవసరం కాబట్టి అతను మరికొన్ని మ్యాచ్‌లు కూడా దూరమయ్యే అవకాశాలున్నాయి.

చెన్నైకి తీరని లోటు..

చెన్నైకి తీరని లోటు..

డుప్లెసిస్, సామ్ కరన్ సేవలు కోల్పోవడం సీఎస్‌కేకు ఎదురుదెబ్బ. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్‌తో డుప్లెసిస్ మంచి ఆరంభాలు అందించాడు. భారీ స్కోర్లకు పునాది వేసాడు. ఫస్టాఫ్ లీగ్‌లో ఏడు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా నాలుగు హాఫ్సెంచరీలు బాదిన ఫాఫ్.. 320 రన్స్ చేశాడు. సీపీఎల్‌లో కూడా దుమ్మురేపాటు. ఓ సెంచరీతో పాటు 270 రన్స్ చేశాడు. అలాంటి ఫాఫ్ దూరమవ్వడం సీఎస్‌కేకు లోటే. ఇక సామ్ కరన్ గైర్హాజరీ కూడా టీమ్‌పై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా రోహిత్ శర్మను ఇబ్బంది పెట్టేందుకు సామ్ కరన్ వేసే షార్ట్ బాల్స్‌ను సీఎస్‌కే కోల్పోనుంది. అతని యార్కర్ల సామర్థ్యంతో పాటు బ్యాటింగ్ సామర్థ్యాన్ని జట్టు మిస్సవ్వనుంది. సామ్ కరన్ యూఏఈ వేదికగా గతేడాది 14 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి.. ఓ హాఫ్ సెంచరీతో 186 రన్స్ చేశాడు. ఐపీఎల్ 2021 ఫస్టాఫ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 15 బంతుల్లో 34 రన్స్ బాదాడు.

ఊతప్ప‌, హజెల్ వుడ్‌లకు చాన్స్..

ఊతప్ప‌, హజెల్ వుడ్‌లకు చాన్స్..

ఇక ఫాప్ డుప్లెసిస్ స్థానంలో రాబిన్ ఊతప్ప బరిలోకి దిగడం ఖాయం. ధనాధన్ లీగ్‌లో ఎంతో అనుభవం ఉన్న ఊతప్ప.. రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఇక సామ్ కరన్ స్థానంలో జోష్ హజెల్ వుడ్ ఆడనున్నాడు. కరోనా భయంతో ఫస్టాఫ్ లీగ్‌కు దూరమైన హెజెల్ వుడ్.. సెకండాఫ్ లీగ్‌కు అందుబాటులోకి వచ్చాడు.

సామ్ కరన్ స్థాయిలో బ్యాటింగ్ చేయకపోయినా భారీ సిక్సర్లను హజెల్ వుడ్ బాదగలడు. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా ఊతప్పకు మంచి రికార్డు ఉంది. ఒకవేళ ఊతప్పను కాదనుకుంటే అంబటి రాయుడు ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మోయిన్ అలీ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు రానున్నాడు.

ముగ్గురు పేసర్లు..

ముగ్గురు పేసర్లు..

నాలుగో స్థానంలో అంబటి రాయుడు బరిలోకి దిగనుండగా.. ఆ తర్వాత సురేశ్ రైనా, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బరిలోకి దిగనున్నారు. ఏడో స్థానంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రానుండగా.. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్‌, లుంగిడి ఎంగిడి, జోష్ హజెల్‌వుడ్‌లు ఆడనున్నారు. జట్టులో 9 మంది ఆటగాళ్లకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉండటం విశేషం. ఒక్క లుంగి ఎంగిడి, హజెల్ వుడ్ మినహా అందరూ బ్యాటింగ్ చేయగలరు. ఇక బౌలర్లుగా లుంగి ఎంగిడీ, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, హజెల్ వుడ్ పేస్ బాధ్యతలు మోయనుండగా.. ఏకైక స్పిన్నర్‌గా జడేజా బౌలింగ్ చేయనున్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు(అంచనా)

చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు(అంచనా)

రాబిన్ ఊతప్ప/ఫాఫ్ డూ ప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, మోయిన్ అలీ, అంబటి రాయుడు, సురేశ్ రైనా, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, లుంగి ఎంగిడి, జోష్ హజెల్ వుడ్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, September 17, 2021, 13:47 [IST]
Other articles published on Sep 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X