ఐపీఎల్ 2018: నిషేధం ముగిసింది, తొలి ప్రాధాన్యత ధోనికే
హైదరాబాద్: రెండేళ్ల నిషేధాన్ని ముగించుకుని ఇండియన్ క్యాష్ రిచ్ లీగ్ టోర్నీ అయిన ఐపీఎల్‌లో తిరిగి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ అడుగుపెట్టనున్నాయి. 2015లో చెన్నై, రాజస్ధాన్ ప్రాంఛైజీలపై స్ఫాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో బీసీసీఐ ఈ రెండు జట్లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఈ రెండు జట్ల నిషేధంతో 2016, 17 ఐపీఎల్ సీజన్లలో చెన్నై, రాజస్ధాన్ జట్లకు బదులు గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ జట్లు వచ్చాయి. చెన్నై, రాజస్ధాన్ జట్లపై విధించిన రెండేళ్ల నిషేధం గురువారంతో ముగిసింది. దీంతో ఈ రెండు జట్లు 2018 ఐపీఎల్‌లో తిరిగి అడుగు పెడుతున్నాయి.
లయన్స్ ఎదురుచూపులు ముగిశాయి
దీంతో శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ నిర్వాహకులు తమ ట్విటర్ ఖాతాలో ‘సూపర్ మార్నింగ్, లయన్స్. ఎదురుచూపులు ముగిశాయి.' అని పోస్టు చేశారు. ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆ జట్టు సాధించిన విజయాలతో పాటు ఆటగాళ్ల గురించి తమ అభిప్రాయాలను ట్విట్టర్‌లో షేర్ చేసుకుంటున్నారు.
వచ్చే ఏడాది వేలంలో ఆటగాళ్లు అందరూ
మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆయా జట్లతో పదేళ్ల ఒప్పందం ముగియడంతో వచ్చే ఏడాది ఆటగాళ్లు అందరూ వేలంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రతినిధి జార్జ్ జాన్ మాట్లాడుతూ ‘ఒకవేళ నిర్వాహకులు మాకు ఏదైనా అవకాశం ఇచ్చి ఒక ఆటగాడిని జట్టులోనే ఉంచుకోమని అంటే మా మొదటి ప్రాధాన్యత మహేంద్ర సింగ్ ధోనీకే, అతన్నే తీసుకుంటాం' అని తెలిపారు.
ధోనితో త్వరలో చర్చలు జరుపుతాం
చైన్నై జట్టుపై నిషేధం సమయంలో ధోని రైజింగ్ పూణె సూపర్ జెయింట్ జట్టు తరుపున ఆడాడు. చెన్నై జట్టుని ధోని నడిపిన తీరు అద్భుతమని, దీనిపై త్వరలో అతడితో చర్చలు జరుపుతామని ఆయన అన్నారు. మరోవైపు చెన్నై జట్టుకి గతంలో ఉన్న కోచ్, మేనేజ్‌మెంట్ సిబ్బందినే తిరిగి ఎంచుకోవాలని చూస్తోంది.
కోచ్‌గా ఫ్లెమింగ్
ఇక గతంలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ఫ్లెమింగ్ చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా ఆయనకే ఆ బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది. దీనిపై కూడా జాన్ స్పందించాడు. సిబ్బందితో చర్చలు జరుపుతున్నామని, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2014లో ఐపీఎల్ విజేతగా అవతరించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications