
కోల్‌కతా వేదికగా మరికొద్ది సేపట్లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ మొదలు కానుంది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. చెన్నై జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు కోల్‌కతా మూడు మార్పులు చేసింది. క్రిస్ లిన్, నరైన్, గుర్నీలు జట్టులోకి వచ్చారు.
చెన్నై జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న చెన్నై.. తమ ఆదిక్యంను మరింత పెంచుకోవాలని చూస్తోంది. మరోవైపు ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. తమ ఓటమి పరంపర కొనసాగకుండా గెలుపుబాట పట్టాలని పట్టుదలతో ఉంది. బలమైన చెన్నై జట్టుపై విజయం సాధించాలంటే కోల్‌కతా శ్రమించాల్సిందే.
జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్:
షేన్ వాట్సన్, డుప్లెసిస్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహీర్.
కోల్‌కతా నైట్‌రైడర్స్:
క్రిస్ లిన్, సునీల్ నరైన్, నితీశ్ రాణా, రాబిన్ ఉతప్ప, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్, కెప్టెన్), శుభమన్ గిల్, ఆండ్రీ రసెల్, పీయూస్ చావ్లా, కుల్దీప్ యాదవ్, గుర్నీ, ప్రదీశ్ క్రిష్ణ.