Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ కటౌట్ తీసుకుని.. ట్రాఫిక్ ఆపేసిన అభిమాని (వీడియో)

Chennai Super Kings fan stops traffic in Pune with cut-out of MS Dhoni, watch video

హైదరాబాద్: పదేళ్లు దాటిపోయినా ఐపీఎల్‌కూ క్రేజ్ తగ్గలేదు. రెండేళ్లు ఐపీఎల్‌కు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఫామ్‌కు లోటు లేదు. ఇప్పటికీ అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న జట్టుగా చెన్నైనే కొనసాగుతోంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆడే మ్యాచ్‌లకే ఎక్కువ ప్రజాదరణ దక్కుతోందని ఇప్పటికే నిర్వాహకులు వెల్లడించారు.

కావేరి జల వివాదం కారణంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ సొంతగడ్డపై ఆడే మ్యాచ్‌లన్ని పుణెకు తరలిన సంగతి తెలిసిందే. వేదిక మారినా ధోనీ సేనకు ఏమాత్రం మద్దతు తగ్గలేదు. పూణెకు కూడా రైలులో వెళ్లి చెన్నై సూపర్ కింగ్స్ కు మద్దతు తెలిపారు చెన్నై వాసులు.

టోర్నీలో భాగంగా సోమవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌-ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ మధ్య పూణె వేదికగా మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ కోసం ఆటగాళ్లు ప్రత్యేక బస్సులో మైదానానికి వస్తున్న క్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్‌కే ప్రధాన కోచ్‌ స్టీపెన్‌ ఫ్లెమింగ్ తన ట్విటర్‌ ద్వారా పంచుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఓ అభిమాని ధోనీ కటౌట్‌ను పట్టుకుని చెన్నై జట్టు ప్రయాణిస్తున్న బస్సుతో పాటు కదులుతూ కనిపించాడు. బస్సులో ఉన్న ధోనీని చూసేందుకు చాలా ప్రయత్నించాడు. కానీ, పాపం అతనికి ధోనీ కనిపించలేదు. ఎందుకంటే ధోనీ ఆ బస్సులో లేడు. ఈ విషయాన్ని ఫ్లెమింగ్ తెలిపాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకుపోయింది. ఈ మ్యాచ్‌లో ధోనీ 22బంతుల్లో 51స్కోరును చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటి వరకూ ధోనీకి ఐపీఎల్‌లో వేగవంతమైన సెంచరీ ఇదే.

Story first published: Tuesday, May 1, 2018, 14:02 [IST]
Other articles published on May 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+