Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రాక్టీస్‌లో ధోని, రైనా: చెపాక్‌లో మొదలైన ఐపీఎల్ సందడి (వీడియో)

Ms Dhoni and Suresh Raina Practice For IPL
Chennai Super Kings Day Out in the Chepauk

హైదరాబాద్: చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందడి మొదలైంది. ఐపీఎల్ 2018 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన ఆటగాళ్లు ఇప్పటికే చెన్నైకి చేరుకున్నారు. రెండేళ్ల విరామం తర్వాత ఈ సీజన్‌లో అడుగుపెట్టిన చెన్నై జట్టుని నిర్వాహకులు బాగా ప్రమోట్ చేస్తున్నారు.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

ఫొటో షూట్‌లు, యాడ్‌లతో బిజీగా గడుపుతోన్న ఆటగాళ్లు మరోపక్క తమ ప్రాక్టీస్‌నూ కొనసాగిస్తున్నారు. ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియానికి చేరుకున్నారు. తాజాగా చెన్నై జట్టులోని ఆటగాళ్లందరూ ప్రాక్టీస్‌లో పాల్గొన్న వీడియోను చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్వాహకులు తమ అధికారిక ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Chennai Super Kings Day Out in the Chepauk

ఈ వీడియోలో ధోని, రైనా, జడేజాతో మిగతా ఆటగాళ్లు వార్మప్‌ చేసిన అనంతరం బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో ప్రాక్టీస్‌ చేశారు. ఐపీఎల్ 2018 సీజన్ ఏప్రిల్‌ 7న ప్రారంభం కానుంది. టోర్నీలో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ తన తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.

Story first published: Saturday, March 24, 2018, 15:57 [IST]
Other articles published on Mar 24, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+