
ప్లే ఆఫ్ కోసం ఫైట్ చేయాల్సిందే..
ఈ సాయంత్రం షార్జా స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్‌కు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. కాస్త బెటర్ పొజీషన్‌లో ఉంటుంది కోహ్లీసేన. లేదంటే- తన స్థానాన్ని మరింత దిగజార్చుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోయంది. 92 పరుగులకే కుప్పకూలిపోయింది.
అటు బౌలింగ్ ఏమైనా రాణించిందా అంటే అదీ లేదు. ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయి.. లక్ష్యాన్ని ఛేదించేశారు నైట్ రైడర్స్. ఈ ఓటమి.. ఆ జట్టు ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టింది. బెంగళూరు మళ్లీ గాడిన పడాలంటే ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిందే.. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఫైట్ చేయాల్సిందే.

ఈ మ్యాచ్ గెలిస్తే.. మళ్లీ టేబుల్ టాపర్‌గా
రాయల్ ఛాలెంజర్స్‌తో పోల్చుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి ఎంతో బెటర్‌గా ఉంది. సెకెండ్ హాఫ్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను మట్టి కరిపించింది. తొలి నాలుగు వికెట్లను నామమాత్రపు స్కోరుకే కోల్పోయినా.. అద్భుతంగా పుంజుకొంది ధోనీసేన. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఒంటి చేత్తో చెన్నై తరఫున భారీ స్కోర్‌కు అందించాడు. 58 బంతుల్లో 88 పరుగులు చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతను భారీ స్కోరుపై కన్నేశాడు.

చెన్నై ప్లేయింగ్ 11 ప్రిడిక్షన్స్ ఇవీ..
ఈ మ్యాచ్‌లో చెన్నై తరఫున తుదిజట్టులో ఎవరు ఆడబోతోన్నారనేది ఆసక్తికరంగా మారింది. పెద్దగా మార్పులు ఉండకపోవచ్చనే అభిప్రాయాలు సైతం వ్యక్తమౌతున్నాయి. క్వారంటైన్ పూర్తి చేసుకుని జట్టుకు అందుబాటులో ఉన్నందున సామ్ కుర్రన్‌కు తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. అతని కోసం ఎవరిని డగౌట్‌కు పరిమితం చేస్తారనేది ఉత్కంఠతకు గురి చేస్తోంది. హేజిల్‌వుడ్ లేదా డ్వేన్ బ్రావోలో ఒకరిని పక్కన కూర్చోబెట్టి.. ఆ స్థానంలో సామ్‌ను చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయి.

జట్టు కూర్పు ఇలా ఉండొచ్చు..
ఈ సాయంత్రం బెంగళూరును ఢీ కొట్టబోయే చెన్నై జట్టులో ఫాప్ డుఫ్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కేప్టెన్-వికెట్ కీపర్), డ్వేన్ బ్రావో/సామ్ కుర్రన్, శార్దుల్ ఠాగూర్, దీపక్ చాహర్, జోష్ హేజిల్‌వుడ్ ఉంటారు. బ్యాటింగ్ విభాగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా డ్వేన్ బ్రావో లేదా హేజిల్‌వుడ్‌లల్లో ఒకరిని పక్కన కూర్చోబెట్టి- సామ్‌కు చోటు కల్పించడానికి అధికావకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications












