

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించింన 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చెన్నై 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
తాజా విజయంలో చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. చెన్నై బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ డుప్లెసిస్ 45 బంతుల్లో43(3 ఫోర్లు) చివరి వరకు నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు అంబటి రాయుడు (21) ఫర్వాలేదనిపించాడు. షేన్ వాట్సన్ (17), సురేశ్ రైనా (14) త్వరగా ఔటయ్యారు.
సత్తాచాటిన బౌలర్లు, చెపాక్‌లో చెన్నై టార్గెట్ 109
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్‌కు 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.
కోల్‌కతా ఓపెనర్లలో క్రిస్ లిన్ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరగా... మరో ఓపెనర్ సునీల్ నరైన్(6) కూడా నిరాశపరిచాడు. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్‌లోనే క్రిస్ లిన్ ఎల్బీ రూపంలో ఔట్ కాగా, హర్భజన్ వేసిన రెండో ఓవర్‌లో సునీల్ నరైన్ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీశ్ రాణాను ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో డకౌట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు.
అటు తర్వాత క్రీజులోకి వచ్చిన రాబిన్ ఊతప్ప(11), కెప్టెన్ దినేశ్ కార్తీక్(19)లు కూడా నిరాశపరిచారు. ఈ క్రమంలో హిట్టర్ ఆండ్రీ రసెల్ 44 బంతుల్లో 50 నాటౌట్ (5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. చివరి వరకు క్రీజులో ఉండి జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోని
చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గత మ్యాచ్‌లో ఆడిన జట్లతోనే బరిలోకి దిగుతున్నాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లు వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి.
ఆడిన ఐదు మ్యాచుల్లో చెరో నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఎనిమిది పాయింట్లు సాధించాయి. నెట్ రన్‌రేట్ వల్ల కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఇరు జట్లూ ఈ మ్యాచ్ గెలవాలనే పట్టదలతో కనిపిస్తున్నాయి.
ఈ సీజన్‌లో ఆండ్రీ రసెల్ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కోల్‌కతా గెలిచిన నాలుగు మ్యాచ్‌ల్లో ఆండ్రీ రసెల్ కీలకపాత్ర పోషించాడు. ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 19 బంతుల్లో 49 పరుగులు... పంజాబ్‌పై 17బంతుల్లో 48 పరుగులు చేసి ఓటమి అంచున ఉన్న కోల్‌కతాను విజయతీరాలకు చేర్చాడు.
దీంతో ఈ మ్యాచ్‌లో ఆండ్రీ రసెల్‌ను సీఎస్‌కే కెప్టెన్ ధోని ఎలా అడ్డుకుంటాడనే దానిపై అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌కి ధోని సేన సొంతగడ్డపై జరుగుతుండటంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ధోని నేతృత్వంలోని చెన్నై వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఆ తర్వాత ముంబై చేతిలో ఓడినప్పటికీ శనివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మళ్లీ విజయం సాధించింది.