
ఐపీఎల్ లెజెండ్‌గా పేరు
ఐపీఎల్‌లో లెజెండ్‌గా పేరు తెచ్చుకున్న సురేష్ రైనా ఎన్నో మ్యాచ్‌లను ఒంటి చేతితో గెలిపించాడు. ఐపీఎల్‌లో అన్ని సీజన్లు చెన్నైసూపర్ కింగ్స్ తరఫునే ఆడాడు. సీఎస్కే లేని రెండు సంవత్సరాలు మాత్రమే గుజరాత్ తరఫున ఆడాడు. ఇక 2020లో వ్యక్తిగత కారణాలతో దూరమైన సీజన్‌ను పక్కన పెడితే, ఐపీఎల్‌లో రైనా ఓ సీజన్‌కు దూరమవడం ఇదే తొలిసారి. మెగా వేలంలో అతని హోం టీం చెన్నై అతని కొనుగోలు చేస్తుందని భావించినప్పకీ అది జరగలేదు. ఇక 2 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్‌తో ఉన్న రైనాను ఇతర టీంలు కూడా కొనుగోలు చేయకపోవడం గమనార్హం.

నిరాశ కల్గించే అంశం
తాజాగా సురేష్ రైనాను కొనుగోలు చేయకపోవడానికి గల కారణాన్ని చెన్నైసూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథ్ వెల్లడించారు. సురేష్ రైనా చాలా కాలంగా చెన్నై తరఫున నిలకడగా రాణిస్తున్నాడన్న ఆయన.. ఈ సారి అతను లేకపోవడం చూస్తే చాలా కష్టంగా ఉందని చెప్పుకొచ్చారు. సీఎస్కే తరఫున ధోని తర్వాత చిన్న తలగా పేరు ఉన్న రైనాను ఈ సారి ఇతర జట్లు కూడా కొనుగోలు చేయకపోవడం నిరాశ కల్గించే అంశమన్నారు.
అందుకే కొనుగోలు చేయలేదు
కానీ జట్టు కూర్పు అనేది ప్రస్తుతం ఆటగాళ్లు ఉన్న ఫామ్‌పై ఆధారపడి ఉంటుందని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని కాశీ విశ్వనాథ్ కోరారు. రైనా ప్రస్తుతం ఉన్న ఫామ్ దృష్యా జట్టుకు సరిపోవడని భావించామని తెలిపారు. అందుకే రైనాను ఈ సారి కొనుగోలు చేయలేదని, అతడిని మిస్ అవుతున్నట్లు ఓ క్రీడా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెన్నైసూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథ్ వివరించారు. కాగా ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సురేష్ రైనా గతేడాది నుంచి ఫేలవ ఫామ్‌లో ఉన్నాడు. ఈ కారణంగానే మెగా వేలంలో రైనాను ఏ జట్టు కొనుగోలు చేయలేదని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఇంత కాలం తమ జట్టుకు సేవ చేసినందుకుగాను సురేష్ రైనాకు ధన్యవాదాలు చెబుతూ సీఎస్కే తమ ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది.

నాలుగో ఆటగాడిగా
సురేష్ రైనాతోపాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసిన ఫాఫ్ డుప్లిసెస్ సేవలను కూడా సీఎస్కే కోల్పోతుందని కాశీ విశ్వనాథ్ తెలిపారు. డుప్లిసెస్ కూడా దశాబ్ద కాలంగా సీఎస్కే తరఫునే ఆడాడని ఆయన గుర్తు చేశారు. ఇక ఐపీఎల్ దిగ్గజాలలో సురేష్ రైనా ఒకడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ తన ఐపీఎల్ కెరీర్‌లో 204 మ్యాచ్‌లు ఆడి 5,528 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ (6283), శిఖర్ ధావన్ (5784), రోహిత్ శర్మ (5611) తర్వాత నాలుగో స్థానంలో ఉన్నాడు.


Click it and Unblock the Notifications
