అందుకే బ్యాటింగ్! అలాగే సీఎస్కే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన ధోనీ, వచ్చే ఏడాది కూడా..!

మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ ఈ ఐపీఎల్ 2022 సీజన్‌లో తన చిట్టచివరి మ్యాచ్‌లు ఆడబోతున్నాయి. ముంబైలోని సీసీఐ బ్రబౌర్న్ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. సంజు శాంసన్ టీమ్ 16పాయింట్లతో పాజిటివ్ నెట్ రన్ రేట్‌తో ఇప్పటికే ప్లేఆఫ్స్‌ ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే 18పాయింట్లతో టాప్ 2పొజిషన్‌కు వెళ్తుంది. గెలవకపోయినా ప్లేఆఫ్స్ చేరుతుంది. చెన్నై సూపర్ కింగ్స్‌కు మాత్రం గెలిచినా, గెలవకున్నా పెద్దగా పోయేదేం లేదు.

ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి ఈ సీజన్‌ను కాస్త తల ఎత్తుకునేలా ముగించాలని మాత్రం చెన్నై భావిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ వేదికగా సాగిన ఐపీఎల్ 2020సీజన్లో ప్లేఆఫ్ చేరకుండా ఇంటిబాట పట్టిన చెన్నై ఈ సీజన్లోనూ ప్లేఆఫ్ చేరకుండానే లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. రాజస్థాన్ రాయల్స్‌పై నేటి మ్యాచ్‌లో గెలిస్తే పాయింట్ల పట్టికలో ఆ జట్టు పాయింట్లు 10కి చేరుకుంటాయి. తద్వారా కాస్త గౌరవంగా లీగ్‌ను ముగించే వీలుంటుంది.

స్వేచ్ఛగా ఆడాలని కోరుకుంటున్నా

స్వేచ్ఛగా ఆడాలని కోరుకుంటున్నా

ఈ క్రమంలో నేటి మ్యాచ్ కోసం ఇరు జట్ల కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, సంజూ శాంసన్ గ్రౌండ్లోకి వచ్చారు. టాస్ గెలిచిన ధోనీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాస్ అనంతరం ధోనీ మాట్లాడుతూ.. మేము తొలుత బ్యాటింగ్ ఎంచుకుంటాం. ఛేజింగ్లో ఉన్నంత ప్రెషర్ లేకుండా మా బ్యాటర్లు తగినంత ఫ్రీడంతో ఆడాలని ఈ నిర్ణయం తీసుకుంటున్నా. ఇది ఎలాగూ చివరి గేమ్. సో ఎలాంటి టెన్షన్ లేకుండా వారు తమ సత్తా ఏంటో స్వేచ్ఛగా ఆడి చూపించాలని కోరుకుంటున్నాను. మా జట్టులో కేవలం ఒకే ఒక్క మార్పు ఉంది. శివమ్ దూబే స్థానంలో రాయుడు జట్టులోకి వచ్చాడు. శివమ్ దూబే బ్యాటింగ్‌తో పాటు మంచి వేగంతో బౌలింగ్ చేసే ప్లేయర్. మంచి బౌన్స్‌‌లు కూడా వేయగలడు. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే దూబేకి మ్యాచ్‌లు ఆడడానికి ఇంకా చాలా టైం ఉంది.

అలా చేస్తే చెన్నై అభిమానులు ఫీల్ అవుతారు

అలా చేస్తే చెన్నై అభిమానులు ఫీల్ అవుతారు

వచ్చే ఏడాది ధోనీ ఐపీఎల్ ఆడతాడో లేదో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న దీనిపై ధోనీ బదులిస్తూ.. నేను అయితే కచ్చితంగా వచ్చే ఏడాది ఆడతానో లేదో చెప్పలేను. కానీ నా మనసులో ఉందేంటంటే.. సీఎస్కే తరఫున సీఎస్కే హోం గ్రౌండ్లో సీఎస్కే అభిమానుల ముందు ఆడాలని ఉంది. ఒకవేళ ఇదే లాస్ట్ ఐపీఎల్ అయితే సీఎస్కే అభిమానులకు అన్యాయం చేసినట్లే. అందుకే వచ్చే ఏడాది కూడా ఎల్లో జెర్సీలో కన్పించాలనుకుంటున్నా. అలాగే వచ్చే ఏడాది కేవలం ముంబై మాత్రమే కాకుండా అన్ని వేదికల్లో గేమ్స్ జరుగుతాయి. అలాంటప్పుడు వీడ్కోలు తీసుకోవడం బాగుంటుందేమో. ఏదేమైనా ఇప్పుడైతే నేను కచ్చితంగా చెప్పలేను అని ధోనీ పేర్కొన్నాడు.

తుది జట్లు

తుది జట్లు

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(w/c), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, ఒబెద్ మెక్‌కాయ్

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ఎన్ జగదీసన్, ఎంఎస్ ధోని(w/c), మిచెల్ సాంట్నర్, ప్రశాంత్ సోలంకి, సిమర్‌జీత్ సింగ్, మతీషా పతిరణ, ముఖేష్ చౌదరి

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, May 20, 2022, 19:27 [IST]
Other articles published on May 20, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X