
మరికొన్ని రోజుల్లోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ప్రారంభం కానుంది. ఈ నెల 26న జరగనున్న తొలి మ్యాచ్‌లో గత ఏడాది సీజన్లో ఫైనల్ చేరిన చెన్నైసూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఇందు కోసం ఇప్పటికే సూరత్ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ ప్రాక్టీసులో ఆ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఆడిన షాట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రాక్టీసులో భారీ షాట్లు ఆడిన ధోని ఏకంగా సింగిల్ హ్యాండ్‌తో సిక్సులు కూడా బాదాడు. ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. 4 పదుల వయసులోనూ సింగిల్ హ్యాండ్‌తో ధోని సిక్సులు బాదడం చూసి అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు. త్వరలో ప్రారంభం కాబోయే ఐపీఎల్ 15లోనూ ధోని ఇలాగే ఆడాలని కోరుకుంటున్నారు. కాగా 40 ఏళ్ల మహేంద్రసింగ్ ధోనినే ఐపీఎల్‌లో ఈ సారి కూడా చెన్నైసూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
మరోవైపు ఐపీఎల్ 2022 కోసం సూరత్ వెళ్లిన చెన్నైసూపర్ కింగ్స్ ఆటగాళ్లకు ఘనస్వాగతం లభించింది. అభిమానులంతా అక్కడికి చేరుకుని ఘనంగా ఆహ్వానించారు. ఇక గత ఏడాది ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 27 పరుగుల తేడాతో ఓడించి ట్రోఫీ గెలుచుకున్న చెన్నైసూపర్ కింగ్స్ ఈ సారి కూడా అదే జోరును కనబర్చాలని చూస్తోంది. కాగా ఐపీఎల్‌లో ఇప్పటివరకు 4 ట్రోఫీలు గెలుచున్న సీఎస్కే అత్యధిక కప్‌లు గెలిచిన జట్ల జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఐదు ట్రోఫీలతో ముంబై ఇండియన్స్ తొలి స్థానంలో ఉంది. ఇప్పటివరకు ముగిసిన 14 ఐపీఎల్ సీజన్లలో ముంబై ఇండియన్స్, చెన్నైసూపర్ కింగ్సే 9 సార్లు విజేతలుగా నిలవడం గమనార్హం.
చెన్నైసూపర్ కింగ్స్ పూర్తి స్క్వాడ్ 2022
మహేంద్ర సింగ్ ధోనీ (12 కోట్లు), రవీంద్ర జడేజా(16 కోట్లు), మొయిన్ అలీ 8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్( 6 కోట్లు), దీపక్ చాహర్( 14 కోట్లు), అంబటి రాయుడు(6.75 కోట్లు), డ్వేన్ బ్రావో (ఓవర్సీస్-4.40 కోట్లు), శివమ్ దూబే( 4 కోట్లు), క్రిస్ జొర్డాన్( 3.60 కోట్లు), రాబిన్ ఉతప్ప(2 కోట్లు), మిచెల్ సాంట్నర్ (ఓవర్సీస్ 1.90కోట్లు), ఆడమ్ మిల్నే (ఓవర్సీస్- 1.90 కోట్లు), విక్రమ్ సోలంకి(1.20 కోట్లు), రాజ్‌వర్థన్(1.50 కోట్లు), డేవన్ కాన్వే (ఓవర్సీస్- రూ. కోటి), మహీష్ తీక్షణ (ఓవర్సీస్ 70 లక్షలు), ప్రిటోరియస్ (ఓవర్సీస్ 50 లక్షలు), కేఎమ్ అసిఫ్, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్, శుభ్రాన్ష్ సేనాపతి, ముకేశ్ చౌధరి, జగదీశన్, హరి నిషాంత్( వీరందరికీ 20 లక్షలు)