Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025 Auction: ఆ ఆటగాళ్లే టార్గెట్ గా వేలంలో పాల్గొననున్న చెన్నై సూపర్ కింగ్స్..

ఐపీఎల్ 2025 మెగా వేలాని(IPL 2025 Auction)కి రంగం సిద్ధమైంది. నవంబర్ 24, 24 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో నిర్వహించనున్నారు. ఇందుకు ఫ్రాంచేజీలు ఏ ఆటగాళ్లను తీసుకోవాలో ప్రణాళిక రచించుకున్నాయి. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ తమ ఫాస్ట్ బౌలింగ్ బలాన్ని పెంచుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా తమ వాలేట్ లో ఉన్న డబ్బుల ఉపయోగించి భారత్ కు చెందిన ఫాస్ట్ బౌలర్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది.

మహ్మద్ షమీ, నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్ వంటి బౌలర్లను కొనుగోలు చేసేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే యువ పేస్ బౌలర్లపై జట్టు యాజమాన్యం దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. యువ బౌలర్లను తీసుకుంటే జట్టుకు దీర్ఘకాలం సేవలు అందించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యువ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ పట్ల చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రసిద్ధి కృష్ణకు అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన అనుభవం కూడా ఉంది.

Chennai Super Kings are looking to strengthen their fast bowling attack

అంతేకాదు ఐపీఎల్ లో ఆర్‌సిబి, రాజస్థాన్ వంటి జట్లకు ఆడాడు. అతను తన ఎత్తుతో ఎలాంటి బ్యాట్స్‌మెన్‌నైనా ఇబ్బంది పెట్టగల ప్రతిభ ఉన్న వ్యక్తి అందుకే సీఎస్కే మొదటి ప్రాధాన్యంగా ప్రసిద్ధ్ కృష్ణను చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇతని తర్వాత యువ బౌలర్ యశ్ ఠాకూర్ పట్ల కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది. లక్నో తరపున ఆడుతున్న యశ్ ఠాకూర్ ను జట్టులోకి తీసుకుంటే ధోని లాంటి మెంటర్ తప్పకుండా అతడిని గొప్ప ఆటగాడిగా తీర్చిదిద్దుతాడాని భావిస్తోంది.

మరో బౌలర్ మధ్వల్ పై కూడా చెన్నై జట్టు యాజమాన్యం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. గత సీజన్ లో ముంబై జట్టుకు ఆడిన మధ్వల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వీరిలో ఎవరినో ఒకరిని లేదా ఇద్దరిని చెన్నై సూపర్ కింగ్ వేలంలో కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Story first published: Wednesday, November 20, 2024, 11:53 [IST]
Other articles published on Nov 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+