For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023 : ఐపీఎల్‌కు మరో లెజెండ్ గుడ్ బై.. బౌలింగ్ కోచ్‌గా కొత్త బాధ్యతలు..!

Chennai Super Kings All-rounder Dwayne Bravo retires from IPL

నిన్న కాక మొన్ననే వెస్టిండీస్ లెజెండ్ కీరన్ పొలార్డ్.. ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. ఆది నుంచి ఉన్న ముంబై ఇండియన్స్ జట్టుతోనే కలిసి ఉండాలని తను డిసైడ్ అయ్యాడు. అందుకే అతనికి ముంబై బ్యాటింగ్ కోచ్‌గా కొత్త బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ముంబై జట్టు ప్రకటించింది. ఇప్పుడే అదే బాటలో మరో విండీస్ లెజెండ్ నడిచాడు.
ఐపీఎల్‌లో ముగిసిన మరో శకం

ఐపీఎల్‌లో ముగిసిన మరో శకం

చెన్నై సూపర్ కింగ్స్‌తో ఎన్నో ఏళ్లుగా కలిసి నడిచిన స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఇకపై ఐపీఎల్‌లో తను ఆడటం లేదని సంచలన విషయం వెల్లడించాడు. ఇప్పటి వరకు 14 ఏళ్ల పాటు ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడిన బ్రావో.. ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. అయితే ప్రతి దానికి ఒక ముగింపు ఉంటుందని, ఇక తను కూడా ఈ పాత్రను పక్కన పెట్టే సమయం వచ్చిందని బ్రావో అన్నాడు. వచ్చే ఏడాది నుంచి ఈ లీగ్ ఆడటం లేదని ప్రకటించాడు. అతను మినీ వేలంలో పేరు నమోదు చేసుకోకపోవడంతో ఇదే విషయంపై కొన్ని వార్తలు వచ్చాయి. చివరకు వీటిని 'ఛాంపియన్' బ్రావో నిర్ధారించాడు.

చెన్నై కోచ్‌గా బాధ్యతలు..

చెన్నై కోచ్‌గా బాధ్యతలు..

ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన డ్వేన్ బ్రావో ఇకపై చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ప్రస్తుతం చెన్నై బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ వచ్చే ఏడాది విశ్రాంతి తీసుకోనున్నాడు. అతని స్థానంలో బ్రావో ఈ బాధ్యతలు నిర్వహిస్తాడని తెలుస్తోంది. దీని గురించి మాట్లాడిన బ్రావో.. తన కొత్త బాధ్యతను నిర్వర్తించేందుకు ఉత్సుకతా ఉన్నానని చెప్పాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా తను నిలుస్తానని ఎప్పుడూ అనుకోలేదన్నాడు. కొత్త ప్రయాణం ఎలా ఉంటుందని ఎదురు చూస్తున్నానని చెప్పాడు.

చెన్నైతో అనుబంధం..

చెన్నైతో అనుబంధం..

ముంబై ఇండియన్స్‌తో తన ఐపీఎల్ ప్రయాణం ప్రారంభించిన డ్వేన్ బ్రావో.. ఆ తర్వాత 2011లో చెన్నైతో కలిశాడు. అప్పటి నుంచి చెన్నై తరఫున అద్భుతంగా రాణిస్తూ 2011, 2012, 2021ల్లో ఐపీఎల్ ట్రోఫీ ముద్దాడాడు. తన కెరీర్‌లో 161 ఐపీఎల్ మ్యాచులు ఆడిన బ్రావో.. 158 వికెట్లు పడగొట్టాడు. గతేడాది వేలంలో అతన్ని రూ.4.4 కోట్లు పెట్టి చెన్నై కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో తను ఆడిన పది మ్యాచుల్లో 16 వికెట్లు తీసుకున్నాడీ విండీస్ ఆల్‌రౌండర్. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాడిగా లసిత్ మలింగ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.

Story first published: Friday, December 2, 2022, 15:32 [IST]
Other articles published on Dec 2, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+