Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: చెన్నైసూప‌ర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. దీప‌క్ చాహ‌ర్ వ‌చ్చేస్తున్నాడు

Chennai Super Kings all-rounder Deepak Chahar is likely to play in IPL 2022 from April
IPL 2022 : This Star Player Can Replace Deepak Chahar In IPL 2022 | Oneindia Telugu

మ‌హేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నైసూప‌ర్ కింగ్స్ అభిమానుల‌కు గుడ్ న్యూస్ అందింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూరంగా ఉంటున్న సీఎస్కే స్టార్ ఆల్‌రౌండ‌ర్ ఐపీఎల్ 2022 ఆడ‌నున్నాడు. కాస్త ఆల‌స్యంగానైనా దీప‌క్ చాహ‌ర్ ఐపీఎల్‌లో అడుగుపెట్ట‌నున్నాడు. ఏప్రిల్ రెండో వారం నుంచి దీప‌క్ చాహ‌ర్ సీఎస్కే త‌ర‌ఫున బ‌రిలోకి దిగే అవ‌కాశాలు ఉన్నాయి. ముందుగా అనుకున్న విధంగా దీప‌క్ చాహర్‌కు స‌ర్జ‌రీ అవ‌స‌రం లేద‌ని బెంగ‌ళూరులోని ఎన్సీఏ వైద్యులు నిర్దారించారు.

మెగా వేలంలో భారీ ధ‌ర‌

మెగా వేలంలో భారీ ధ‌ర‌

పేస్ ఆల్‌రౌండ‌ర్ అయినా దీప‌క్ చాహ‌ర్‌కు ఐపీఎల్ 2022 మెగా వేలంలో భారీ ధ‌ర ల‌భించింది. చాహ‌ర్‌ను చెన్నైసూప‌ర్ కింగ్స్ ఏకంగా 14 కోట్ల రూపాయ‌ల భారీ ధ‌ర వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ఆట‌గాళ్ల‌లో దీప‌క్ చాహ‌ర్ రెండో స్థానంలో నిలిచాడు. అయితే గ‌త సీజ‌న్లోనూ దీప‌క్ చాహ‌ర్ చెన్నైసూప‌ర్ కింగ్స్‌కే ఆడాడు. కాగా మెగా వేలంలో చెన్నైసూప‌ర్ కింగ్స్ ఆట‌గాళ్ల‌కు ఇంత భారీ మొత్తంలో అరుదుగా ఖ‌ర్చు చేస్తూ ఉంటుంది.

చాహ‌ర్‌కు గాయం

చాహ‌ర్‌కు గాయం

దుర‌దృష్ట‌వ‌శాత్తూ వెస్టిండీస్‌తో జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో దీప‌క్ చాహ‌ర్ గాయ‌ప‌డ్డాడు. తొడ కండ‌రాల గాయానికి గురి కావ‌డం, దాని తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌డంతో స‌ర్జ‌రీ చేయ‌నున్నార‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో శ్రీ‌లంక‌తో సిరీస్‌కు పూర్తిగా దూర‌మ‌య్యాడు. దీంతో ఈ ఐపీఎల్ సీజ‌న్ దీప‌క్ చాహ‌ర్ ఆడ‌డం క‌ష్ట‌మేన‌నే వార్త‌లు కూడా వెలువ‌డ్డాయి.

అయితే బెంగ‌ళూరులోని జాతీయ క్రికెట్ అకాడ‌మీలో కోలుకుంటున్న దీప‌క్ చాహ‌ర్‌కు స‌ర్జ‌రీ అవ‌స‌రం లేద‌ని ట్రెయినర్లు చెప్పార‌ట‌. దీంతో మ‌రికొన్ని రోజుల్లోనే దీప‌క్ చాహ‌ర్ జ‌ట్టుతో క‌లిసే అవ‌కాశం ఉంది. ఏప్రిల్ రెండో వారం నుంచి ఐపీఎల్‌లో బ‌రిలోకి దిగ‌నున్నాడ‌ని తెలుస్తోంది. కాగా సూర‌త్‌లో చెన్నైసూప‌ర్ కింగ్స్ జ‌ట్టు ఇప్ప‌టికే ప్రాక్టీసు మొద‌లుపెట్టింది.

 చెన్నైసూప‌ర్ కింగ్స్ పూర్తి స్క్వాడ్ 2022

చెన్నైసూప‌ర్ కింగ్స్ పూర్తి స్క్వాడ్ 2022

మ‌హేంద్ర సింగ్‌ ధోనీ (12 కోట్లు), రవీంద్ర జడేజా(16 కోట్లు), మొయిన్‌ అలీ 8 కోట్లు), రుతురాజ్‌ గైక్వాడ్‌( 6 కోట్లు), దీపక్‌ చాహర్‌( 14 కోట్లు), అంబటి రాయుడు(6.75 కోట్లు), డ్వేన్ బ్రావో (ఓవర్సీస్‌-4.40 కోట్లు), శివమ్ దూబే( 4 కోట్లు), క్రిస్‌ జొర్డాన్‌( 3.60 కోట్లు), రాబిన్ ఉతప్ప(2 కోట్లు), మిచెల్ సాంట్నర్ (ఓవర్సీస్ 1.90కోట్లు), ఆడమ్ మిల్నే (ఓవర్సీస్‌- 1.90 కోట్లు), విక్రమ్‌ సోలంకి(1.20 కోట్లు), రాజ్‌వర్థన్‌(1.50 కోట్లు), డేవన్‌ కాన్వే (ఓవర్సీస్‌- రూ. కోటి), మహీష్ తీక్షణ (ఓవర్సీస్ 70 లక్షలు), ప్రిటోరియస్ (ఓవర్సీస్ 50 లక్షలు), కేఎమ్‌ అసిఫ్, తుషార్‌ దేశ్‌పాండే, సిమర్‌జీత్‌ సింగ్, శుభ్రాన్ష్‌ సేనాపతి, ముకేశ్‌ చౌధరి, జగదీశన్‌, హరి నిషాంత్‌( వీరంద‌రికీ 20 లక్షలు)

Story first published: Wednesday, March 9, 2022, 12:22 [IST]
Other articles published on Mar 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+