Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: చెన్నైసూప‌ర్ కింగ్స్‌కు బిగ్ షాక్‌.. ఐపీఎల్ 2022 నుంచి దీప‌క్ చాహ‌ర్ ఔట్‌!

Chennai super kings all rounder Deepak Chahar chances completely out of IPL 2022 due to injury
IPL 2022 : CSK's Star Player Likely To Miss IPL 2022 Starting Matches | Oneindia Telugu

మ‌రో నెల రోజుల్లో ఐపీఎల్ 2022 ప్రారంభం కానుంది. అయితే లీగ్ ప్రారంభం కావ‌డానికి ముందే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైసూప‌ర్ కింగ్స్‌కు బిగ్ షాక్ త‌గిలేలా ఉంది. మెగా వేలంలో ఆ జ‌ట్టు కోట్ల రూపాయ‌లు పోసి కొనుగోలు చేసిన ఆల్‌రౌండ‌ర్ దీప‌క్ చాహ‌ర్ ఈ సీజ‌న్ మొత్తానికి దూర‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ మేర‌కు త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని తెలుస్తోంది.

సీజ‌న్ మొత్తానికి దూరం

సీజ‌న్ మొత్తానికి దూరం

కొంత కాలంగా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో నిల‌క‌డ‌గా రాణిస్తున్న దీప‌క్ చాహ‌ర్ వెస్టిండీస్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో గాయ‌ప‌డ్డాడు. బౌలింగ్ చేస్తున్న స‌మ‌యంలో అత‌ని తొడ కండ‌రాలు ప‌ట్టేశాయి. దీంతో ఆ మ్యాచ్‌లో చాహ‌ర్ 1.5 ఓవ‌ర్లు మాత్ర‌మే బౌలింగ్ చేసి మైదానాన్ని వీడాడు. అయితే వేసింది 11 బంతులే అయిన‌ప్ప‌టికీ అప్ప‌టికే రెండు వికెట్లు తీసి స‌త్తా చాటాడు. గాయంతో మొద‌ట శ్రీ‌లంక‌తో సిరీస్‌కు, ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌ల‌కు మాత్ర‌మే దీప‌క్ చాహ‌ర్ దూర‌మ‌వుతాడ‌నే వార్త‌లు వ‌చ్చాయి. కానీ తాజాగా ఐపీఎల్ సీజ‌న్ మొత్తానికే దూర‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌నే వార్త‌లు చెన్నైసూప‌ర్ కింగ్స్‌ను క‌ల‌వ‌ర పెడుతున్నాయి. దీపక్ చాహర్ గాయం తీవ్రం కావడంతో మరో దారి కనిపించడం లేదని సమాచారం.

కోట్లు పోసి కొనుగోలు

కోట్లు పోసి కొనుగోలు

బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన‌ ఐపీఎల్ 2022 మెగా వేలంలో స్టార్ ఆల్‌రౌండ‌ర్ దీప‌క్ చాహ‌ర్‌ను చెన్నైసూప‌ర్ కింగ్స్ భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది. 2 కోట్ల రూపాయ‌ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వ‌చ్చిన చాహ‌ర్‌ను సీఎస్కే మెనేజ్‌మెంట్ ఇత‌ర ఫ్రాంచైజీల‌తో పోటీ ప‌డి మ‌రి 14 కోట్ల రూపాయ‌ల భారీ ధ‌ర‌కు ద‌క్కించుకుంది. దీప‌క్ చాహ‌ర్‌కు వ‌చ్చిన ఈ ధ‌ర ఈ సీజ‌న్లో రెండ‌వ అత్య‌ధిక‌మైన‌ది.

చాహ‌ర్ రికార్డులు

చాహ‌ర్ రికార్డులు

క్రికెట్‌లో ఇటీవ‌ల బాల్‌తోనే కాకుండా బ్యాట్‌తో కూడా దీప‌క్ చాహ‌ర్ రాణిస్తున్నాడు. సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో హాఫ్ సెంచ‌రీ కొట్టి స‌త్తా చాటాడు. కెరీర్లో ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్‌లో 63 మ్యాచ్‌లు ఆడిన దీప‌క్ చాహ‌ర్ 59 వికెట్లు తీశాడు. ఇక అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 20 మ్యాచ్‌ల్లో 26 వికెట్లు తీశాడు. 7 వ‌న్డే మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు.

చెన్నైసూప‌ర్ కింగ్స్ పూర్తి జ‌ట్టు

చెన్నైసూప‌ర్ కింగ్స్ పూర్తి జ‌ట్టు

మ‌హేంద్ర సింగ్‌ ధోనీ (కెప్టెన్‌), రవీంద్ర జడేజా, మొయిన్‌ అలీ, రుతురాజ్‌ గైక్వాడ్‌, దీపక్‌ చాహర్‌, అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో, శివమ్ దూబే, క్రిస్‌ జొర్డాన్‌, రాబిన్ ఉతప్ప, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, విక్రమ్‌ సోలంకి, రాజ్‌వర్థన్‌, డేవన్‌ కాన్వే, మహీష్ తీక్షణ, ప్రిటోరియస్, కేఎమ్‌ అసిఫ్, తుషార్‌ దేశ్‌పాండే, సిమర్‌జీత్‌ సింగ్, శుభ్రాన్ష్‌ సేనాపతి, ముకేశ్‌ చౌధరి, జగదీశన్‌, హరి నిషాంత్‌.

Story first published: Wednesday, February 23, 2022, 19:13 [IST]
Other articles published on Feb 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+