Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MIvsCSK : అరంగేట్రానికి సఫారీ ఆల్‌రౌండర్ రెడీ.. ముంబైని ఢీకొట్టే చెన్నై జట్టు ఇదే!

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే అభిమానుల్లో ఎంత ఉత్సాహం ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే వాంఖడే స్టేడియంలో ముంబైని ఎదుర్కొనేందుకు చెన్నై రెడీ అయింది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై తరఫున అరంగేట్రం చేసేందుకు సఫారీ ఆల్‌రౌండర్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

వాంఖడే పిచ్ నుంచి స్పిన్నర్లకు పెద్ద సహకారం లభించదు. కాబట్టి మిచెల్ శాంట్నర్‌ను ధోనీ పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. గత మ్యాచ్‌లో శాంట్నర్ అద్భుతంగా బౌలింగ్ చేసినా.. జట్టుకు మరో పేసర్ అవసరం అయినప్పుడు అతన్నే పక్కకు తప్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో శాంట్నర్ స్థానంలో సఫారీ ఆల్‌రౌండర్ సిసాండ మగాల, డ్వేన్ర ప్రిటోరియస్‌లలో ఒకరిని ఆడించాల్సి ఉంటుంది.

Sisanda Magala

వీళ్లిద్దరిలో ఎవరు ఆడినా చెన్నై బ్యాటింగ్ లైనప్ డెప్త్ పెరగడం ఖాయం. కానీ ప్రస్తుతం ఉన్న ఫామ్‌ను బట్టి చూసుకుంటే సిసాండ్ మగాలను ఆడించడమే కరెక్ట్ అనిపిస్తుంది. అతను ఇటీవలే సౌతాఫ్రికా తరఫున చెలరేగిన సంగతి తెలిసిందే. దానికితోడు మగాల ఎక్స్‌ట్రా పేస్ కూడా ఈ మ్యాచ్‌లో చాలా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ కారణంగా ప్రిటోరియస్‌ను కూడా కాదని మగాలను ఆడించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ధోనీ తన జట్టులో ఎక్కువ మార్పులు చేయడానికి ఇష్టపడడు. కాబట్టి మిగతా జట్టులో పెద్దగా ఎలాంటి మార్పులూ ఉండకపోవచ్చు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే ఇద్దరూ మంచి ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో చెన్నై ఆడిన రెండు మ్యాచుల్లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన తుషార్ దేశ్‌పాండేను ఈ మ్యాచ్‌లో కూడా అదే రోల్‌లో ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

చెన్నై జట్టు (అంచనా): డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయీన్ అలీ, అంబటి రాయుడు, బెన్ స్టోక్స్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), సిసాండ మగాల, దీపక్ చాహర్, రాజ్‌వర్ధన్ హంగ్రేకర్

సబ్‌స్టిట్యూట్ ప్లేయర్స్: తుషార్ దేశ్‌పాండే, అజింక్య రహానే, నిషాంత్ సింధు, ప్రశాంత్ సోలంకీ, ఆకాష్ సింగ్

Story first published: Saturday, April 8, 2023, 14:06 [IST]
Other articles published on Apr 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+