కోహ్లీసేనకు షాక్: ఓకీఫ్‌కు సూచనలు, ఎవరీ శ్రీధరన్ శ్రీరామ్
హైదరాబాద్: నాలుగు టెస్టుల మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పూణెలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. స్వదేశంలో టెస్టుల్లో టీమిండియా అత్యంత చెత్త రికార్డుని నెలకొల్పడంలో ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్ ఓకీఫ్ కీలకపాత్ర పోషించాడు.
పూణె టెస్టులో 70 పరుగులిచ్చి 12 వికెట్లు తీశాడు. అంతేకాదు టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ గణాంకాలను సైతం నెలకొల్పాడు. అయితే తాను పూణె టెస్టులో రాణించడం వెనుక చెన్నైకు చెందిన శ్రీరామ్ శ్రీధరన్ ఉన్నాడని ఓకీఫ్ చెప్పుకొచ్చాడు. ఓకీఫ్ ఇండియా ఏ సిరిస్ (2015) సందర్భంగా తాను చెన్నైలో శ్రీధరన్‌తో కలిసి పనిచేసినట్లు ఓకీఫ్ చెప్పాడు.
'శ్రీధరన్ ప్రభావం నాపై చాలా ఉంది. 2015లో ఎ సిరీస్ సందర్భంగా ఫీల్డ్‌లో శ్రీధరన్‌తో మాట్లాడేవాడిని. అతను లోకల్ వ్యక్తి. ఇక్కడి కండిషన్స్, బ్యాట్స్‌మెన్ ఎలా ఆలోచిస్తారు అన్నది అతనికి బాగా తెలుసు' అని అన్నాడు. లంచ్ విరామ సమయంలో అతనితో కలిసి బౌలింగ్ చేస్తూ మెళకువలు నేర్చుకున్నానని ఓకీఫ్ పేర్కొన్నాడు.

క్రికెట్ ఆస్ట్రేలియాతో కలిసి పనిచేస్తున్న శ్రీధరన్ శ్రీరామ్
2015 నుంచి శ్రీధరన్ శ్రీరామ్ క్రికెట్ ఆస్ట్రేలియాతో కలిసి పనిచేస్తున్నాడు. 2015లో ఆస్ట్రేలియా ఏ జట్టు చెన్నైలోని చెపాక్ స్టేడియానికి వచ్చినపుడు ఇక్కడి కండిషన్స్‌పై అతను విలువైన సూచనలు ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి ఆస్ట్రేలియా ఉపఖండం టూర్లకు శ్రీరామ్ కన్సల్టెంట్‌గా వ్వవహారిస్తున్నాడు.

స్పిన్‌ను ఎలా ఎదుర్కోవాలనే దానిపై సలహాలు
అంతేకాదు ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్పిన్‌ను ఎలా ఎదుర్కోవాలనే దానిపై కూడా చిన్నపాటి సలహాలను కూడా ఇస్తుంటాడు. 2000 సంవత్సరంలో శ్రీధరన్ టీమిండియా తరుపున 8 వన్డేలాడాడు. ఈ క్రమంలో ఆసీస్ స్పిన్నర్ ఓకీఫ్‌తో పాటు ఆసీస్ జట్టులోని మిగతా ఆటగాళ్లకు శ్రీరామ్ ఇచ్చిన సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి.

శ్రీధరన్ అద్భుతమైన స్పిన్ బౌలింగ్ కోచ్
'శ్రీధరన్ అద్భుతమైన స్పిన్ బౌలింగ్ కోచ్. అతనితో కలిసి రెండుసార్లు పనిచేశాను. ఆ ప్రభావం నాపై చాలా ఉంది' అని ఓకీఫ్ చెప్పుకొచ్చాడు. పూణె టెస్టులో రెండోరోజు తొలి సెషన్‌లో ఓకీఫ్ ఒక్క వికెట్ కూడా తీయకపోవడంతో అతను ఎక్కడ తప్పు చేస్తున్నాడో శ్రీరామ్ చెప్పాడు.

లంచ్ విరామంలో ఓకీఫ్‌కు టిప్స్
లంచ్ విరామంలో శ్రీధరన్ శ్రీరామ్ ఇచ్చిన టిప్స్‌తో రెండో సెషన్‌లో చెలరేగిన ఓకీఫ్ టీమిండియా నడ్డి విరిచాడు. తొలి టెస్టులో ఆసీస్ విజయం సాధించిన తర్వాత కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా శ్రీరామ్ సేవలను కొనియాడాడు. ఇప్పటివరకు శ్రీరామ్ టీ20 వరల్డ్‌కప్‌తోపాటు శ్రీలంక టూర్లో ఆసీస్ జట్టుకు శ్రీధరన్ తన సేవలందించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications