Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2019: చెన్నైలో మే 12న ఐపీఎల్ ఫైనల్‌!

 Chennai to host 2019 IPL final on May 12

హైదరాబాద్: ఐపీఎల్‌-12 ఫైనల్‌కు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదిక కానుంది. మే 12న ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహిస్తారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో తొలుత రెండు వారాల షెడ్యూల్‌ని విడుదల చేసిన బీసీసీఐ.. తాజాగా గ్రూప్ దశ వరకూ షెడ్యూల్‌ని ప్రకటించింది. మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మొదలుకానుండగా.. మే 5న గ్రూప్ దశ ఆఖరి మ్యాచ్ జరగనుంది. ఇందులో మొత్తం 56 మ్యాచ్‌లు ఉన్నాయి. అయితే.. క్వాలిఫయర్స్, ఎలిమినేటర్, ఫైనల్‌ మ్యాచ్‌ల తేదీలు, వేదికల్ని మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు.

ప్రత్యామ్నాయ వేదికగా వైజాగ్‌

ప్రత్యామ్నాయ వేదికగా వైజాగ్‌

ఇందులో 12 మ్యాచ్‌లు సాయంత్రం నాలుగు గంటలకు ఆరంభమవుతాయి. ప్రస్తుత షెడ్యూల్‌ ప్రకారం ఏదైనా వేదికలో ఏవైనా అనుకోని కారణాల వల్ల మ్యాచ్‌ నిర్వహణ కష్టంగా మారితే ప్రత్యామ్నాయ వేదికగా వైజాగ్‌ను నిర్వాహకులు ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. ఎప్పటిలాగే ఇంటా, బయటా పద్ధతిలో ప్రతీ జట్టు 14 మ్యాచ్‌లు ఆడుతుంది.

12 మ్యాచ్‌లు సాయంత్రం నాలుగు గంటలకు

12 మ్యాచ్‌లు సాయంత్రం నాలుగు గంటలకు

అయితే, మే 7న క్వాలిఫయర్‌-1, మే 8న ఎలిమినేటర్‌, మే 10న క్వాలిఫయర్‌-2, మే 12న ఫైనల్‌ నిర్వహించనున్నట్లు సమాచారం. మ్యాచ్‌ల సమయాల్లో కూడా ఎలాంటి మార్పు లేకుండా సాయంత్రం 4 గంటలకు, రాత్రి 8 గంటలకే ప్రారంభమవుతాయి. మార్చి 23న చెన్నైలో చెన్నై, బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్‌ 12వ సీజన్‌ మొదలవుతుంది.

హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లివే...:

హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లివే...:

మార్చి 29 : రాజస్థాన్‌తో (రాత్రి 8)

మార్చి 31 : బెంగళూరుతో (సాయంత్రం 4)

ఏప్రిల్‌ 6 : ముంబైతో (రాత్రి 8)

ఏప్రిల్‌ 14 : ఢిల్లీతో (రాత్రి 8)

ఏప్రిల్‌ 17 : చెన్నైతో (రాత్రి 8)

ఏప్రిల్‌ 21 : కోల్‌కతాతో (సాయంత్రం 4)

ఏప్రిల్‌ 29 : పంజాబ్‌తో (రాత్రి 8)

Story first published: Wednesday, March 20, 2019, 9:31 [IST]
Other articles published on Mar 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+