For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్టార్ క్రికెటర్‌కు చీర్‌లీడర్ చెల్లెలు: అన్న వికెట్ పడితే తెగ డ్యాన్స్ చేసింది!

ఐపీఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 ఫ్రాంచైజీ లీగ్‌గా మారింది. 2008లో ప్రారంభమైన ఈ లీగ్.. 18 సీజన్లలో ఎంతో మారిపోయింది. ఈ లీగ్‌లో ఆడని క్రికెటర్ లేడంటే అతిశయోక్తి కాదు. దీనికి కారణం ఐపీఎల్‌లో లభించే అపారమైన డబ్బు, కీర్తి వల్లే. అయితే కేవలం ఇవే కాకుండా ఈ లీగ్‌కు గ్లామర్ టచ్ కూడా అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ముఖ్యంగా చీర్‌లీడర్స్ ఐపీఎల్‌కు గ్లామర్ టచ్ ఇస్తారు. బౌండరీ దగ్గర స్టేజ్‌పై ప్రతి ఫోర్, సిక్స్, వికెట్‌కు చీర్‌లీడర్లు డ్యాన్స్ చేస్తుంటే, అభిమానులకు వినోదం రెట్టింపవుతుంది.

సాధారణంగా చీర్‌లీడర్ల గురించి పెద్దగా సమాచారం బయటకు రాదు. అయితే ఐపీఎల్‌లో ఒక చీర్‌లీడర్ ఉండేది. ఆమె సోదరుడు అదే లీగ్‌లో ఆడేవాడు. ఆ సోదరుడు ఎవరో కాదు.. ప్రపంచంలోని గొప్ప ఆల్‌రౌండర్లలో ఒకరైన దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం జాక్వెస్ కలిస్. అవును, జాక్ కలిస్ సోదరి జానిన్ కలిస్ ఐపీఎల్‌లో చీర్‌లీడర్‌గా పనిచేసింది.

Cheerleader Sister of a Star Cricketer Danced When Her Brother Lost His Wicket

సీఎస్కే చీర్‌లీడర్‌గా జానిన్
జానిన్ కలిస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఆమె అభిరుచికి కుటుంబం, సోదరుడు జాక్ కలిస్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. ఆమె చాలా కాలం పాటు ప్రొఫెషనల్ చీర్‌లీడర్‌గా పనిచేసింది. ఐపీఎల్‌లో జానిన్ కలిస్ 2009లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) చీర్‌లీడర్ల బృందంలో చేరింది. 2009లో భారత్‌లో లోక్‌సభ ఎన్నికల కారణంగా ఐపీఎల్ దక్షిణాఫ్రికాకు తరలించబడింది. ఆ సమయంలో జాక్వెస్ కలిస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఒక మ్యాచ్‌లో జాక్ కలిస్ ఔట్ అయినప్పుడు, అతని సోదరి జానిన్ అతని వికెట్‌కు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకుంది.నిబంధనల ప్రకారం, వికెట్ పడినప్పుడు ఏ జట్టుకు చెందిన చీర్‌లీడర్ అయినా డ్యాన్స్ చేయాలి.

ప్రస్తుతం జానిన్ కలిస్ ఏం చేస్తున్నారు?
ఆమె ప్రొఫెషనల్ చీర్‌లీడర్ జీవితం తర్వాత జానిన్ కలిస్ ప్రస్తుతం తన డ్యాన్స్ పట్ల ఉన్న అభిరుచిని కొనసాగిస్తూనే ప్రొఫెషనల్ మోడల్‌గా, ఫిట్‌నెస్ నిపుణురాలిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా చురుకుగా ఉంటూ తన మోడలింగ్, ఫిట్‌నెస్ పోస్టులను పంచుకుంటున్నారు.

Story first published: Wednesday, October 29, 2025, 11:16 [IST]
Other articles published on Oct 29, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+