Viral Video: ఎంతకు తెగించార్రా బాబు! చీర్ లీడర్లకు ఫోన్ నెంబర్లు రాసి మరీ వేధింపులు!!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా శనివారం లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ వైపు పంజాబ్ జట్టు అద్భుత విజయాన్ని సాధించగా.. మరోవైపు స్టేడియంలో జరిగిన ఓ సిగ్గుచేటు ఘటన క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా కొందరు ఆకతాయిలు శృతిమించి ప్రవర్తించారు. స్టేడియంలో ఆటగాళ్లను ఉత్సాహపరిచే చీర్ లీడర్స్ పట్ల అసభ్యంగా ప్రవర్తించి, వేధింపులకు గురిచేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
కరెన్సీ నోటుపై ఫోన్ నెంబర్ రాసి వికృత చేష్టలు
మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో లక్నో జట్టుకు సపోర్ట్ చేస్తున్న చీర్ లీడర్స్ కూర్చునే సీటింగ్ ప్రాంతం వెనుక వైపు ఉన్న కొందరు ప్రేక్షకులు వారిని దారుణంగా ర్యాకింగ్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి బరితెగించి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. కరెన్సీ నోటుపై తన ఫోన్ నెంబర్ రాసి ఆ నోటును మడిచి చీర్ లీడర్ పైకి విసిరాడు. ఆ నోటు కాస్తా నేరుగా వెళ్లి ఓ చీర్ లీడర్‌కు తగలడంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి, ఆగ్రహానికి గురైంది.

పోలీసులకు ఫిర్యాదు.. కామాంధుడు అరెస్ట్!
సదరు ఆకతాయి ప్రవర్తనపై సదరు చీర్ లీడర్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ధీటుగా స్పందించింది. తనపైకి విసిరిన ఆ కరెన్సీ నోటును వెతికి పట్టుకుని, అక్కడే రక్షణ బాధ్యతల్లో ఉన్న పోలీసులకు అప్పగించింది. తనను వేధింపులకు గురిచేసిన వ్యక్తిని చూపిస్తూ అక్కడికక్కడే ఫిర్యాదు చేసింది. దీంతో తక్షణమే స్పందించిన పోలీసులు.. నోటుపై నెంబర్ రాసి విసిరిన ఆ కామాంధుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇండియా పరువు తీస్తున్నారంటూ ఫ్యాన్స్ ఆగ్రహం
ఈ ఘటనకు సంబంధించిన వార్త బయటకు రావడంతో సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు, నెటిజనలు సదరు ఆకతాయిలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. "క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్తే ఆటను ఆస్వాదించి రావాలి తప్ప.. ఇలాంటి చెత్త పనులు చేసి దేశం పరువు తీయకూడదు" అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేడియాలలో మహిళలకు, చీర్ లీడర్లకు భద్రతను మరింత కఠినతరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం
మరోవైపు మైదానంలో జరిగిన పోరులో ఆరు పరాజయాల తర్వాత పంజాబ్ కింగ్స్ ఎట్టకేలకు అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే 197 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేవలం 51 బంతుల్లోనే మెరుపు సెంచరీ బాదగా.. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 69 పరుగులతో రాణించాడు. దీంతో పంజాబ్ 18 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుని ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. ఇవాళ జరగబోయే మ్యాచ్‌లో ముంబై చేతిలో రాజస్థాన్ ఓడిపోతే పంజాబ్ అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications