టెస్టు క్రికెట్‌లో గంభీర్ సత్తాకు పరీక్షగా నిలిచింది ఆ ఇన్నింగ్సే!

హైదరాబాద్: దశాబ్దంన్నర పాటు అభిమానులను అలరించిన టీమిండియా గౌతమ్ గంభీర్ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు మంగళవారం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. గురువారం నుంచి ఫిరోజ్‌షా కోట్లా వేదికగా ఆంధ్రతో మొదలయ్యే రంజీ మ్యాచ్ తనకు చివరిదని పేర్కొన్నాడు.
37 ఏళ్ల గౌతమ్ గంభీర్ భారత్ తరపున 58 టెస్ట్‌లు, 147 వన్డేలు, 37 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. 2016లో ఇంగ్లాండ్‌తో చివరి టెస్టు ఆడిన గౌతం గంభీర్.. చివరి వన్డేను కూడా 2013లో ఇంగ్లాండ్‌తోనే ఆడటం విశేషం. గంభీర్ తన చివరి టీ20ని 2012లో పాకిస్థాన్‌పై ఆడాడు. అంతేకాదు భారత్ సాధించి రెండు వరల్డ్ కప్‌ల్లోనూ సభ్యుడిగా ఉన్నాడు.
ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన 2011 వరల్డ్‌కప్ ఫైనల్లో 97 పరుగులతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక, 2007 టీ20 వరల్డ్‌కప్ నెగ్గిన జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. దీంతో పాటు కెప్టెన్‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును రెండుసార్లు విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు.

2007 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో
2007 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో గంభీర్ (75; 54 బంతుల్లో 8 ఫోర్లు,2 సిక్సర్లు) అలాగే 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో 122 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో గంభీర్ చేసిన 97 పరుగులు ఇప్పటికీ ప్రత్యేకం. ఈ రెండో టోర్నీల్లో టీమిండియా విజయం సాధించడంలో గంభీర్‌దే కీలకపాత్ర. ఈ రెండు టోర్నీల తుది పోరులో గంభీర్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

గంభీర్ కీలక పాత్ర
దీంతో పాటు టీమిండియా సాధించిన అనేక చిరస్మరణీయ విజయాల్లో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. 2009లో భారత్ టెస్టుల్లో తొలిసారి నంబర్‌వన్‌గా నిలిచినప్పుడు, 2008లో ఆస్ట్రేలియా గడ్డపై చిరస్మరణీయ సీబీ వన్డే సిరీస్ గెలిచినప్పుడు గంభీర్ జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. ఆరంభంలో ఒడిదుడుకులకు లోనైన గంభీర్ టెస్టు కెరీర్ ఆ తర్వాత ఊపందుకుంది.

గంభీర్ ఆడిన 13 టెస్టుల్లో ఎనిమిది సెంచరీలు
2008 జూలై నుంచి 2010 జనవరి మధ్య కాలంలో గంభీర్ ఆడిన 13 టెస్టుల్లో ఏకంగా ఎనిమిది సెంచరీలు సాధించాడు. వీటిలో సొంతగడ్డ ఢిల్లీలో ఆస్ట్రేలియాపై సాధించిన డబుల్ సెంచరీ కూడా ఉంది. అయితే వన్డే వరల్డ్ కప్ తర్వాత గంభీర్ జట్టులో చోటు దక్కించుకోలేపోయాడు. ఒకానొక సమయంలో టెస్టు కెప్టెన్‌గా కూడా పేరు వినిపించినా ఆ తర్వాత చోటు దక్కించుకోవడమే కష్టంగా మారింది.

విజయ్, ధావన్ ఓపెనర్లుగా నిలదొక్కుకోవడంతో
విజయ్, ధావన్ ఓపెనర్లుగా నిలదొక్కుకోవడంతో గంభీర్ జట్టుకు దాదాపుగా దూరమయ్యాడు. 2014లో ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్‌కు మళ్లీ పిలుపు వచ్చినా 4, 18, 0, 3 స్కోర్లతో విఫలమయ్యాడు. భారత్ తరుపున గంభీర్ ఎన్నో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ 2009లో నేపియర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో గంభీర్ ఆడిన ఇన్నింగ్స్ అతని టెస్టు కెరీర్‌లో అతి పెద్ద హైలైట్‌గా క్రికెట్ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

10 గంటల 43 నిమిషాల పాటు క్రీజులో
ఇదే విషయాన్ని గంభీర్ సైతం వెల్లడించడం విశేషం. ఈ మ్యాచ్‌లో భారత్ ఫాలో ఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లో 10 గంటల 43 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసి 137 పరుగులు చేసిన గంభీర్ మ్యాచ్ డ్రాగా ముగియడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్ టెస్టు క్రికెట్‌లో గంభీర్ సత్తాకు పరీక్షగా నిలిచింది. ఈ మ్యాచ్‌తో పాటు ఆ తర్వాతి టెస్టును కూడా ‘డ్రా' చేసుకున్న టీమిండియా తొలి టెస్టులో విజయం సాధించడంతో కివీస్ గడ్డపై సిరీస్‌ను నెగ్గింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications