సెల్ఫీ టైం: తన అభిమాన నటితో యువరాజ్ సింగ్
హైదరాబాద్: టీమిండియా వెటనర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన అభిమాన నటితో దిగి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా యువరాజ్ సింగ్, బాలీవుడ్ హీరోయిన్ కాజోల్‌ని ఓ ఎయిర్‌పోర్టులో కలుసుకున్నారు.
ఇంకేముంది వెంటనే కాజోల్‌తో ఓ ఫోటో దిగేశాడు. ఆ ఫోటోని తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసి 'విమానం రాక ఆలస్యం కావడంతో అభిమాన నటితో యువీ సెల్ఫీ టైం' అని కామెంట్ పెట్టాడు. మరోవైపు ఇదే ఫొటోను కాజోల్ కూడా తన ఇన్‌స్టాగ్రాం ద్వారా పంచుకుంది.
ప్రస్తుతం స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా తొలి మూడు వన్డేల కోసం ఎంపిక చేసిన యువరాజ్ సింగ్‌కి చోటు దక్కని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ జట్టులో ఆట ముగిసిందంటూ క్రీడా విశ్లేషకులు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. అయితే యువీ మాత్రం దేశవాళీ క్రికెట్‌లో రాణించేందుకు కసరత్తులు చేస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications