న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ మధ్య లంచ్ పోటీ పెట్టినట్లుంది ఈ ఫొటోలను గమనిస్తుంటే. క్రికెట్ మైదానం నలువైపులా ఉత్సాహంగా పరుగెత్తే భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి ఎలాంటి ఫిట్‌నెస్‌తో ఉంటాడో మనందరికీ తెలిసిన విషయమే.

మరి అలాంటి ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలంటే కోహ్లీ నోరు కట్టేసుకుంటాడేమో అనుకుంటాం కానీ.. తాజాగా విరాట్ కోహ్లీ తన డిన్నర్ టేబుల్‌పై వివిధ వంటకాలతో ఓ ఫొటో దిగి సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

అయితే ఈ పదార్థాలన్నీ కోహ్లీ ఒక్కడే ఆరగించి ఉంటాడా? లేదా అనే విషయాన్ని పక్కనపెడితే.. ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ మధ్యనే కుర్ర క్రికెటర్లతో కలిసి రాత్రి భోజనం చేస్తూ ఓ సెల్ఫీ దిగి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
కాగా, ఈ సెల్ఫీకి కౌంటర్ అన్నట్లుగా కోహ్లీ తాజాగా తన డిన్నర్ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో ఉంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ వన్డే, టీ20లకు నాయకత్వం వహిస్తుండగా.. కోహ్లి టెస్టుల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.