న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘చీట్‌.. చీట్‌’ అంటూ హేళన: ఎయిర్‌పోర్ట్‌లో స్మిత్‌కు అవమానం (వీడియో)

By Nageshwara Rao
Cheat, cheat: Steve Smith booed as he leaves South Africa

హైదరాబాద్: కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్‌ టాంపరింగ్‌‌కు పాల్పడి ఏడాది పాటు నిషేధానికి గురైన స్టీవ్‌ స్మిత్‌కు చేదు అనుభవం ఎదురైంది. క్రికెట్ ఆస్ట్రేలియా తమ ఇంటెగ్రెటీ హెడ్ లెయిన్ రాయ్‌తో చేపట్టిన విచారణ ముగియడం... విచారణ పూర్తయ్యే సరికి జొహన్నెస్‌బర్గ్ చేరుకున్న సీఏ సీఈఓ సదర్లాండ్ స్మిత్, వార్నర్, బాన్‌క్రాప్ట్‌లకు శిక్ష ఖరారు చేయడం చకా చకా జరిగిపోయాయి.

ఏడాది నిషేధం: స్మిత్, వార్నర్‌కు కలిగిన ఆర్ధిక నష్టం ఎంతో తెలుసా?ఏడాది నిషేధం: స్మిత్, వార్నర్‌కు కలిగిన ఆర్ధిక నష్టం ఎంతో తెలుసా?

విచారణ ముగిసిన అనంతరం స్మిత్, వార్నర్, బాన్‌క్రాప్ట్‌లను తక్షణమే ఆస్ట్రేలియాకు పంపించేశారు. ఈ నేపథ్యంలో జొహానెస్‌బర్గ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న స్టీవ్ స్మిత్‌ను చూసిన అభిమానులు 'చీట్‌.. చీట్‌' అంటూ హేళన చేశారు. స్మిత్‌ను కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎయిర్ పోర్ట్‌లో సాగనంపారు.

మరోపక్క మీడియా స్మిత్‌ను మాట్లాడాల్సిందిగా కోరింది. అయితే, పోలీసుల సాయంతో స్మిత్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మరోవైపు ఆస్ట్రేలియాకు చేరుకున్న తర్వాత టాంపరింగ్ వివాదంపై గురువారం సాయంత్రం సిడ్నీలో స్మిత్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నాడు. కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో స్మిత్‌, వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌ బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే.

దీనిపై విచారణ చేపట్టిన క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) స్మిత్‌, వార్నర్‌పై ఏడాది నిషేధం విధించగా.... బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించిన బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించింది. దీంతో దక్షిణాఫ్రికాతో శుక్రవారం నుంచి జరుగబోయే నాలుగో టెస్ట్‌కు ఈ ముగ్గురి స్థానంలో రెన్‌షా, బర్న్స్, మ్యాక్స్‌వెల్ జట్టులో చేరగ టిమ్ పైనీ కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు.

Story first published: Thursday, March 29, 2018, 11:56 [IST]
Other articles published on Mar 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X