సెంచరీతో సచిన్ రికార్డుని బద్దలు కొట్టిన 'ఛేజ్ మాస్టర్' విరాట్ కోహ్లీ
హైదరాబాద్: కరీబియన్ గడ్డపై టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది. గురువారం కింగ్‌స్టన్‌లో జరిగిన చివరి వన్డేలో విండిస్‌పై 8 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (111 నాటౌట్: 115 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సుల)తో సెంచరీ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
దీంతో ఐదు వన్డేల సిరిస్‌ను 3-1తో భారత్ కైవసం చేసుకుంది. ఐదో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ భారత బౌలర్లు మహ్మద్ షమీ(4/48), ఉమేశ్ యాదవ్(3/53) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. విండిస్ బ్యాట్స్‌మెన్లలో హోప్ సోదరులు షెయ్(51), కైల్(46) రాణించారు.
దీంతో విండీస్ ఆమాత్రం స్కోరు చేయగలిగింది. ఆనంతరం 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ, దినేశ్ కార్తిక్ అర్ధ సెంచరీతో రాణించడంతో 36.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుని అధిగమించాడు.

వన్డేల్లో కోహ్లీకి ఇది 28వ సెంచరీ
వన్డేల్లో కోహ్లీకి ఇది 28వ సెంచరీ కాగా, చేధనలో 18వ సెంచరీ కావడం విశేషం. ఇప్పటివరకూ ఛేజింగ్‌లో అత్యధిక సెంచరీల రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(17) పేరిట ఉంది. కింగ్ స్టన్ వేదికగా విండీస్‌పై జరిగిన చివరి వన్డేలో చేసిన సెంచరీతో కోహ్లీ... సచిన్ రికార్డును అధిగమించాడు.

సచిన్‌కి 232 ఇన్నింగ్స్‌లు
చేధనలో 17 సెంచరీలు సాధించడానికి సచిన్‌కి 232 ఇన్నింగ్స్‌లు పట్టగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 102 ఇన్నింగ్స్‌ల్లో 18 సెంచరీలు సాధించాడు. మూడో స్థానంలో శ్రీలంక వెటరన్ క్రికెటర్ దిల్షాన్ (116 ఇన్నింగ్స్‌ల్లో 11 సెంచరీలు), క్రిస్ గేల్ (139 ఇన్నింగ్స్‌ల్లో 11 సెంచరీలు) చేశారు.

చేధనలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు:
18* - Virat Kohli (102 innings),
17 - Sachin Tendulkar (232 innings),
11 - Tilakratne Dilshan (116 innings),
11* - Chris Gayle (139 innings).

వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు:
49 - Sachin Tendulkar (452 inngs),
30 - Ricky Ponting (365),
28 - Sanath Jayasuriya (433)/ Virat Kohli (181*),
25 - Kumar Sangakkara (380)/ Hashim Amla (153).
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications