Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చిక్కుల్లో టీమిండియా ఓపెనర్.. వారణాసి కోర్టులో​ చార్జ్‌షీట్ దాఖలు!!

Chargesheet filed against Openar Shikhar Dhawan in Varanasi court

ఢిల్లీ: టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్‌ ధావన్ చిక్కుల్లో పడ్డాడు. ధావన్‌పై గురువారం వారణాసి కోర్టులో​ చార్జ్‌షీట్‌ దాఖలైంది. దేశంలో బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో ధావన్‌ పక్షులకు ఆహారం వేయడం ఏంటని సిద్దార్థ్‌ శ్రీవాత్సవ అనే లాయర్‌ అతనిపై చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. లాయర్‌ చార్జ్‌షీట్‌తో జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ త్రితియా దివాకర్‌ కుమార్‌ గురువారం ధావన్‌పై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను ఫిబ్రవరి 6న జరపనున్నట్లు మెజిస్ట్రేట్‌ తెలిపారు.

గతవారం శిఖర్ ధావన్ వారణాసి టూర్‌కి వెళ్లాడు. గంగా నదిపై పడవ మీద వెళ్లిన ధావన్.. పక్షులకి గింజలు పెట్టడం ద్వారా నిబంధనల్ని అతిక్రమించాడు. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం వారణాసిలో పర్యాటకులు పక్షులకి ఎలాంటి ఆహరం పెట్టకూడదని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. బోట్‌పై కూర్చుని పక్షికి ఫుడ్ తినిపిస్తున్న ఫొటోని ధావన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'పక్షులకు మేత వేయడం ఆనందంగా ఉంది' అని ఆ ఫొటోకి క్యాప్షన్ పెట్టాడు. దీంతో గబ్బర్ రూల్స్ బ్రేక్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

నెట్టింట గబ్బర్ ఫోటోలు వైరల్‌ కావడంతో వారణాసి కలెక్టర్‌ స్పందించారు. ఓపెనర్ శిఖర్ ధావన్‌ విహరించిన బోటు యజమానిపై చర్యలకు ఆదేశించారు. వారణాసిలో పక్షులకి ఫుడ్ పెట్టకూడదనే రూల్ పర్యాటకులకి తెలియకపోవచ్చు. కాబట్టి బోట్‌మెన్‌లు తప్పనిసరిగా తమ పడవలోని టూరిస్ట్‌లకి ఆ విషయాన్ని తెలియజేయాలి. ఈ విషయం ధావన్‌కు చెప్పని బోట్‌మెన్‌పై చర్యలు తీసుకుంటాం అని అన్నారు. తాజాగాసిద్దార్థ్‌ శ్రీవాత్సవ అనే లాయర్‌ ధావన్‌పై చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను ఫిబ్రవరి 6న జరపనున్నట్లు మెజిస్ట్రేట్‌ తెలిపారు.

ఈ నెల 21 నాటికి దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలకు బర్డ్‌ఫ్లూ విస్తరించినట్టు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఆరు రాష్ట్రాల్లో పౌల్ట్రీ కోళ్లలోను, మిగతా పది రాష్ట్రాల్లో ఇతర పక్షల్లోనూ ఈ వ్యాధి వ్యాపించినట్టు పేర్కొంది. ఇప్పటికే సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడినట్టు సమాచారం తెలుస్తోంది. కొన్నిచోట్ల పక్షలు కూడా చనిపోయాయి.

Story first published: Thursday, January 28, 2021, 19:55 [IST]
Other articles published on Jan 28, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+