Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెస్టు కెప్టెన్ గా ధోనీ పనికి రాడు: చాపెల్


జైపూర్: టెస్టు మ్యాచుల కెప్టెనుగా మహేంద్ర సింగ్ ధోనీ పనికి రాడని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ అన్నారు. రాజస్థాన్ క్రికెట్ బోర్డు కోచుగా వ్యవహిస్తున్న ఆయన ఆదివారం జైపూరులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు నైన్టీస్ ఫీవర్ ఉందనే మాట నిజం కాదని ఆయన అన్నారు. తాను భారత క్రికెటర్లకు ఏ విధమైన సలహాలు ఇవ్వబోనని ఆయన అన్నారు.

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) వ్యవహారశైలి మారనంత వరకు ఎవరు కోచుగా ఉన్నా ఏమీ చేయలేరని ఆయన అన్నారు. తనకు ప్రాణహాని ఉందని తాను ఎప్పుడూ భావించలేదని ఆయన అన్నారు. భారత్ లో తనకు వర్ణవివక్ష పరంగా అవమానం జరిగిందని తాను అన్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. లలిత్ మోడీ తీరు నచ్చే తాను రాజస్థాన్ క్రికెట్ బోర్టు కోచుగా పని చేయగలుగుతున్నానని ఆయన అన్నారు. ఏడాదికి ఆరు నెలలు ఆయన జైపూరులో ఉండి శిక్షణ ఇస్తాడు.
Story first published: Sunday, November 18, 2007, 23:53 [IST]
Other articles published on Nov 18, 2007
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+