మెల్‌బోర్న్: ప్రపంచకప్‌లో భాగంగా మెల్‌బోర్న్ స్టేడియంలో జరుగుతున్న దక్షిణాఫ్రికా - భారత్ మ్యాచ్‌కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ హాజరయ్యారు. ఆయన మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. భారత్ బాగా ఆడినప్పుడు అభిమానులు.. సచిన్ పేరును కూడా పలవరించారు.
మ్యాచ్ ఆసాంతం సచిన్.. సచిన్ అంటూ అభిమానులు కేకలు వేశారు. దీంతో సచిన్ టెండుల్కర్ అసలు క్రికెట్ నుండి రిటైర్ అయ్యారా అనే పరిస్థితి కనిపించింది. సచిన్ ప్రపంచకప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు, సౌతాఫ్రికా పైన భారత్ 130 పరుగుల తేడాతో గెలిచింది.

కాగా, భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇప్పటి వరకూ జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ఒకే ఒక సెంచరీ నమోదైంది. టెస్టు, వన్డే ఫార్మెట్స్‌లో ఎన్నో ప్రపంచ రికార్డులను నెలకొల్పిన సచిన్ పేరిటే ఈ రికార్డు కూడా ఉంది. 2011 వరల్డ్ కప్‌లో భాగంగా నాగపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో సచిన్ 111 పరుగులు సాధించాడు.
1999లో అప్పటి సౌరవ్ గంగూలీ 97 పరుగులు చేశాడు. ఇరు జట్ల మధ్య వరల్డ్ కప్‌లో రెండో ఉత్తమ స్కోరు ఇది. ఫోర్ల విషయానికి వస్తే ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన ఘనత సెహ్వాగ్‌కు దక్కుతుంది. 2011 వరల్డ్ కప్‌లో అతను 12 బౌండరీలు సాధించాడు. 1999లో 11 ఫోర్లు కొట్టిన గంగూలీ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ రెండు జట్లు తలపడిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారీగా సిక్సర్లు నమోదయ్యాయి. సచిన్ మూడు సిక్సర్లతో నంబర్ వన్‌గా ఉన్నాడు.