INDvsAUS : తెలుగు కుర్రాడు అరంగేట్రం.. సీఎం జగన్ సహా లీడర్ల కంగ్రాట్స్!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టు మ్యాచులో తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ అరంగేట్రం చేశాడు. అతనికి వెటరన్ బ్యాటర్ ఛటేశ్వర్ పుజారా నుంచి టెస్టు క్యాప్ అందుకున్నాడీ వికెట్ కీపర్ బ్యాటర్. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ యాక్సిడెంట్ కారణంగా క్రికెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ఇషాన్ కిషన్, కేఎస్ భరత్‌లలో ఒకరు అరంగేట్రం చేయడం గ్యారంటీ అయింది. ఈ నేపథ్యంలో తొలి టెస్టులో కేఎస్ భరత్‌ను ఆడించాలని టీం మేనేజ్‌మెంట్ నిర్ణయించింది.
సీఎం శుభాకాంక్షలు..
ఇలా తెలుగు కుర్రాడు భారత్ తరఫున టెస్టు అరంగేట్రం చేయడంతో అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లీడర్లు భరత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా భరత్‌కు కంగ్రాట్స్ చెప్పారు.
ట్విట్టర్‌లో భరత్ ఫొటో షేర్ చేసిన జగన్.. 'ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో మనలో ఒకడైన కోన భరత్.. భారత క్రికెట్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. అతనికి నా బెస్ట్ విషెస్. తెలుగు జెండా ఉన్నతంగా ఎగురుతూనే ఉంది' అని ట్వీట్ చేశారు.
చంద్రబాబు, లోకేష్ కూడా..
అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా భరత్‌ను అభినందించాడు. 'ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో కోన భరత్ అరంగేట్రం చేస్తున్నట్లు తెలిసి చాలా సంతోషంగా ఉంది. దేశం గర్వించేలా అతను సత్తా చాటే క్షణం కోసం ఎదురు చూస్తూ.. అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నా' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
చంద్రబాబుతోపాటు ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా భరత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 'భారత్ తరఫున అరంగేట్రం చేస్తున్న కోన భరత్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. భారత్‌కు అతను సుదీర్ఘకాలం, విజయవంతంగా సేవలు అందించాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్' అని లోకేష్ ట్వీట్ చేశారు.
తెలుగు ప్రజలు ఫుల్ ఖుషీ..
తెలుగు ప్రజలు కూడా భరత్ అరంగేట్రం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాగా, తొలి టెస్టు ఆరంభంలోనే మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ ఇద్దరూ విజృంభించారు. వీళ్ల బౌలింగ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఇద్దరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు. అయితే ఆ తర్వాత వచ్చిన స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ ఇద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిర్మిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications