For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారు: బాబు

By Pratap
Chandrababu Naidu
హైదరాబాద్: ఐపియల్ వ్యవహారాలతో దేశ ప్రతిష్టతను దిగజారుస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. బెట్టింగుల్లో మంత్రులు, కాంగ్రెసు నేతల ప్రమేయం ఉందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. ఐపియల్ లో డబ్బు, మహిళ, గ్లామర్ వ్యవహారాలు చోటు చేసుకుని జుగుప్సాకరంగా మారాయని ఆయన అన్నారు. లలిత్ మోడీ లాంటి నేరపూరిత వ్యక్తులు ఐపియల్ వ్యవహారంలో భాగస్వాములయ్యారని ఆయన అన్నారు. ఐపియల్ -3 ప్రసార హక్కుల్లో 125 కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకుందని, ఇది ఐపియల్ లోని అవినీతికి మచ్చుతునక మాత్రమేనని ఆయన అన్నారు. ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకుని ఐపియల్ వ్యవహారాలు నడుస్తున్నాయని ఆయన అన్నారు. పెద్దలు సొమ్ము చేసుకుంటున్నారని ఆయన అన్నారు.

కాంగ్రెసు చేత గాని తనం వల్లనే ఐపియల్ కుంభకోణం జరిగిందని ఆయన విమర్శించారు. పైగా ఏమీ తెలియనట్లు కాంగ్రెసు వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ లు, బెట్టింగులు జరుగుతున్నాయని, వీటిలో క్రికెటర్లు, పెద్దలు భాగస్వాములైనట్లు కూడా వార్తలు వస్తున్నాయని, ఇది దేశానికి అవమానరకంగా పరిణమించిందని ఆయన అన్నారు. కాంగ్రెసు నేతలకు ప్రత్యర్థుల ఫోన్ లను ట్యాప్ చేయడం అలవాటుగా మారిందని ఆయన అన్నారు. శరద్ పవార్ తదితరుల ఫోన్ ల ట్యాపింగ్ జరిగినట్లు వచ్చిన వార్తలపై ఆయన ప్రతిస్పందించారు. ఎవరి ఫోన్ లు ట్యాప్ అవుతున్నాయో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+