609 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం.. భారత క్రికెట్ చరిత్రలో మరో రికార్డు!!

కోల్‌కతా: భారత క్రికెట్ చరిత్రలో మరో రికార్డు వచ్చి చేరింది. మరో అత్యధిక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. రంజీ ట్రోఫీ రౌండ్-9 ప్లేట్ గ్రూపులో భాగంగా మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో చండీగఢ్ రికార్డు సృష్టించింది. చండీగఢ్ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 609 పరుగులు ఆధిక్యం సాధించింది. భారత క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంగా రికార్డుల్లోకెక్కింది.

భారత క్రికెట్ చరిత్రలో చండీగఢ్ రికార్డు:
మణిపూర్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 26.4 ఓవర్లలో 63 పరుగులకే ఆలౌట్ కాగా.. చండీగఢ్ 672/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. బిపుల్ శర్మ (200; 276 బంతుల్లో 27 ఫోర్లు, 4 సిక్స్‌లు), గురిందర్ సింగ్ ( 200 నాటౌట్; 171 బంతుల్లో 23 ఫోర్లు, 4 సిక్స్‌లు) ద్విశతకాలతో చెలరేగడంతో చండీగఢ్ భారీ స్కోరు చేసింది. కీపర్ ఉదయ్ కౌల్ (148) కూడా భారీ సెంచరీ సాధించడంతో చండీగఢ్ ఆరొందలకు పైగా స్కోరు చేసింది. ఫలితంగా భారత క్రికెట్ చరిత్రలో నాలుగో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని చండీగఢ్ సంపాదించింది.

తొలి సెషన్‌లోనే ఆలౌట్:
బుధవారం (ఫిబ్రవరి 12వ) మ్యాచ్ ప్రారంభం కాగా.. రెండో రోజుకే మణిపూర్ తమ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించడం విశేషం. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మణిపూర్ వికెట్ కోల్పోకుండా 33 పరుగులు చేసింది. కాగా.. మణిపూర్ జట్టును బుధవారం తొలి సెషన్‌లోనే ఆలౌట్ చేసి దాదాపు రెండు రోజులు పాటు ఆడిన చండీగఢ్ అరుదైన రికార్డును నమెదు చేసింది.

హోల్కర్@1
తాజా రికార్డు కంటే భారత ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు 3 అత్యధిక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం రికార్డులు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక ఆధిక్యం సాధించిన జట్లలో హెల్కర్ 722 పరుగుల మొదటి ఇన్నింగ్స్‌ను సాధించి తొలి స్థానంలో కొనసాగుతోంది. 1945-46 సీజన్‌లో హోల్కర్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 912 పరుగులకు డిక్లేర్ చేయగా.. మైసూర్ 190 పరుగులకే ఆలౌటైంది.

రెండో స్థానంలో హైదరాబాద్:
1993-94 సీజన్‌లో హైదరాబాద్ 681 పరుగుల ఆధిక్యాన్ని సాధించి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ తన తొలి ఇన్నింగ్స్‌లో 944/6 వద్ద డిక్లేర్డ్ చేయగా.. ఆంధ్ర తమ మొదటి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ అయింది. 2014-15 సీజన్‌లో కర్ణాటక-తమిళనాడు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక 628 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. కర్ణాటక మొదటి ఇన్నింగ్స్‌లో 762 పరుగులు చేయగా.. తమిళనాడు 134 పరుగులే చేసింది. తాజాగా చండీగఢ్ 609 పరుగుల ఆధిక్యం సాధించి ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications