For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'పంత్.. కార్తీక్‌లు నిరూపించుకునేందుకు చక్కని అవకాశం'

Chance for Pant, Karthik to show their mettle: Rohit Sharma

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి నేపథ్యంలో తాత్కాలిక కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు మళ్లీ భుజానికేసుకున్నాడు. ఈ క్రమంలోనే యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని తనను తాను నిరూపించుకుంటాడని టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. దినేశ్‌ కార్తీక్‌కు కూడా ఓ మంచి అవకాశం దొరికిందని అన్నాడు.

ధోనీ స్థానంలో పంత్‌ బాగా రాణించగలడని

ధోనీ స్థానంలో పంత్‌ బాగా రాణించగలడని

భారత్‌-వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్ల మధ్య రేపు మొదటి టీ20 మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఫామ్ లేమితో బాధపడుతోన్న వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీని ఈ మ్యాచులకు సెలెక్టర్లు ఎంపిక చేయలేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ యువ ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు. ధోనీ స్థానంలో వచ్చిన పంత్‌ బాగా రాణించగలడని చెప్పాడు.

పంత్‌, కార్తీక్‌లకు ఓ గొప్ప అవకాశం

పంత్‌, కార్తీక్‌లకు ఓ గొప్ప అవకాశం

‘మా దృష్టిలో ధోనీ ఓ గొప్ప ఆటగాడు. మిడిల్‌ ఆర్డర్‌లో ఆయనకున్న అపార అనుభవాన్ని ఇప్పుడు ఉపయోగించుకోలేకపోతున్నాం. కానీ, రిషబ్‌ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌లకు ఓ గొప్ప అవకాశం దొరికింది. తమను తాము నిరూపించుకోవడానికి ఇదో మంచి అవకాశం. ఈ మూడు టీ20ల సిరీస్‌ కూడా వరల్డ్‌ కప్‌కు సన్నాహక మ్యాచుల్లా ఉపయోగపడుతుంది. వీరిద్దరిపై ప్రయోగం చేయడానికి, వారి ఆటతీరును పరీక్షించడానికి ఇది ఓ అవకాశంలా కూడా పని చేస్తుంది.

మొదటిసారి ఎంపికైన నదీమ్, పాండ్యా

మొదటిసారి ఎంపికైన నదీమ్, పాండ్యా

'మనం కేవలం ఎంపికవుతున్న 15 మంది ఆటగాళ్ల సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా ఇతర క్రికెటర్ల ఆటను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. కొత్తవారు చాలా మందే ఉన్నారు. టీ20 లకు షాబజ్‌ నదీమ్, కృనాల్ పాండ్యా మొదటిసారి ఎంపికయ్యారు. కొత్త వారిలో వీళ్లు కొందరు. రానున్న వరల్డ్‌ కప్‌కి అత్యుత్తమ క్రికెట్‌ జట్టుతో బరిలోకి దిగే లక్ష్యంలో భాగంగా కొత్త వారికి అవకాశాలు వస్తున్నాయి. వారు నిరూపించుకోవాల్సి ఉంది' అని రోహిత్‌ అన్నాడు.

మొదట బ్యాట్స్‌మెన్‌ని.. తర్వాత కెప్టెన్‍‌ని

మొదట బ్యాట్స్‌మెన్‌ని.. తర్వాత కెప్టెన్‍‌ని

తాను టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయంపై రోహిత్‌ స్పందిస్తూ... ‘మొదట నేను బ్యాట్స్‌మెన్‌ని. ఇతర బాధ్యతలను నేను పూర్తిగా ఉల్లాసవంతంగా నిర్వర్తిస్తున్నాను. కెప్టెన్‌గా ఉండడం నా కెరీర్‌కి ఉపయోగపడింది. జట్టుకి ఉపయోగపడేలా ఆటగాళ్లలో ఒకరిగా ఉంటున్నాను. భారత జట్టులోనే కాదు ఐపీఎల్‌లోనూ కెప్టెన్‌గా బాధ్యతలను ఎంతో ఉల్లాసవంతంగా నిర్వహిస్తున్నాను. ప్రస్తుత మా ప్రత్యర్థి వెస్టిండీస్‌ చాలా క్లిష్టమైన‌ జట్టు. టీ20ల్లో వారు చాలా బలంగా ఉంటారు. ' అని రోహిత్‌ చెప్పాడు. ‌ ‌

Story first published: Sunday, November 4, 2018, 12:23 [IST]
Other articles published on Nov 4, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+