కోహ్లీ ప్రపంచంలోనే నంబర్ వన్‌గా కానున్నాడా..??


హైదరాబాద్: ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి చక్కని అవకాశం. బర్మింగ్‌హామ్‌లో ఆగస్టు 1న మొదలయ్యే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో అతడు అద్భుత ప్రదర్శన చేస్తే నంబర్ వన్ అవుతాడు. బాల్ ట్యాంపరింగ్ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్‌పై ఏడాది వరకు నిషేధం ఉండటం విరాట్‌కు కలిసిరానుంది. బాల్ ట్యాంపరింగ్ విషయంలో ప్రస్తుతం ఏడాదిపాటు నిషేధంలో ఉన్న స్మిత్‌కన్నా కోహ్లీ 26 పాయింట్ల వెనుకంజలో ఉన్నాడు.
ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న స్టీవ్‌స్మిత్ (929)కు విరాట్ (903)కు మధ్య ఉన్న అంతరం కేవలం 26 పాయింట్లే. ఈ సిరీస్‌లో కోహ్లీ రాణిస్తే స్మిత్‌ను దాటేయడం ఖాయం. ఇక టాప్-50 బ్యాట్స్‌మెన్ జాబితాలో భారత్, ఇంగ్లాండ్ నుంచి ఐదుగురు ఆటగాళ్లు ఉండటం గమనార్హం.

వారిద్దరితో పాటు మిగిలిన బ్యాట్స్‌మెన్
భారత టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పుజారా ఆరు, లోకేశ్ రాహుల్ 18, అజింక్య రహానె 19, మురళీ విజయ్ 23, శిఖర్ ధావన్ 24 ర్యాంకుల్లో ఉన్నారు. ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ 3, అలిస్టర్ కుక్ 13, జానీ బెయిర్‌స్టో 16, బెన్‌స్టోక్స్ 28, మొయిన్ అలీ 48 ర్యాంకుల్లో ఉన్నారు.

కోహ్లీ విశేషంగా రాణిస్తే స్మిత్ వెనక్కి ఖాయం
ఒకవేళ బుధవారం నుంచి ఇంగ్లండ్‌తో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్‌లో కోహ్లీ విశేషంగా రాణిస్తే స్మిత్‌ను వెనక్కినెట్టడం ఖాయం. పుజారా ఆరోస్థానం, లోకేశ్ రాహుల్ 18, రహానె 19, మురళీ విజయ్ 23, ధావన్ 24వ ర్యాంకులో కొనసాగుతున్నారు.

బౌలర్ల విషయానికి వస్తే ..
బౌలర్ల విషయానికి వస్తే జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లాండ్) టాప్ ర్యాంకులో.. స్పిన్నర్ జడేజా మూడు, అశ్విన్ ఐదో ర్యాంకులో ఉన్నారు. షమి (17), భువనేశ్వర్ (25), ఇషాంత్ (26), ఉమేశ్ యాదవ్ (28), కుల్దీప్ (56) ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు.

112 పాయింట్లతో భారత్ అగ్రస్థానానికి ముప్పు
జట్టు ర్యాంకింగ్స్‌లో భారత్ 125 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా ఇంగ్లాండ్ 97 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. భారత్ క్లీన్‌స్వీప్ చేస్తే 129 పాయింట్లకు చేరడంతో పాటు ఇంగ్లాండ్ ఆరో స్థానానికి పడిపోతుంది. ఇంగ్లాండ్ 5-0తో స్వీప్ చేస్తే ఆ జట్టు 10 పాయింట్లు పెంచుకొని రెండో స్థానానికి చేరుకుంటుంది. 112 పాయింట్లతో భారత్ అగ్రస్థానానికి ముప్పు ఏర్పడుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications