Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీకి మరో ఛాన్స్: అజారుద్దీన్ రికార్డుపై గురి

హైదరాబాద్: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకి చేరువలో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరిస్‌లో కోహ్లీ టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ రికార్డుని అధిగమించే అవకాశం లభించింది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో 3-0తేడాతో విజయం సాధించిన కోహ్లీ సేన మంచి జోరు ఉంది.

మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజాగా ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు సిద్ధమైంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా నవంబర్ 9న తొలి టెస్టు మ్యాచ్ రాజ్‌కోట్‌ జరగనుంది. న్యూజిలాండ్‌ను 3-0తో వైట్ వాష్ చేయడంతో టెస్టుల్లో టీమిండియా నెంబర్ వన్ ర్యాంకుని దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరిస్‌ను కూడా కైవసం చేసుకోవాలని అటు కోహ్లీతో పాటు టీమిండియా ఆటగాళ్లు మంచి ఉత్సాహాంతో ఉన్నారు. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఆడిన 17 టెస్టుల్లో పదింటిలో విజయం సాధించగా, ఐదు డ్రా, రెండింటిలో ఓటమి పాలైంది. టెస్టుల్లో భారత జట్టుకు అత్యధిక విజయాలనందించిన కెప్టెన్లలో మహమ్మద్ అజారుద్దీన్ మూడో స్ధానంలో ఉన్నారు.

Chance for Kohli to break Azhar's Test record

అజారుద్దీన్ కెప్టెన్సీలో భారత్ జట్టు 47 మ్యాచ్‌లను ఆడగా అందులో 14 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో గనుక కోహ్లీ నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే అజారుద్దీన్ రికార్డుని సమం చేసేస్తాడు.

అదే టెస్టు సిరిస్‌లో ఇంగ్లాండ్‌ను 5-0తో వైట్ వాష్ చేస్తే టీమిండియాకు అత్యధిక విజయాలనందించిన మూడో టెస్టు కెప్టెన్‌గా కోహ్లీ అవతరిస్తాడు. ఇక టీమిండియాకు టెస్టుల్లో అత్యధిక విజయాలను అందించిన కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని మొదటి స్ధానంలో ఉన్నాడు.

ధోని కెప్టెన్సీలో టీమిండియా మొత్తం 60 మ్యాచ్‌లు ఆడగా అందులో 27 మ్యాచ్‌ల్లో భారత జట్టు విజయం సాధించింది. 21 విజయాలతో రెండో స్థానంలో గంగూలీ ఉన్నాడు. ధోని వీడ్కోలు అనంతరం టీమిండియాకు 32వ టెస్టు కెప్టెన్‌గా కోహ్లీ 2014లో ఆస్ట్రేలియా జట్టుపై బాధ్యతలు స్వీకరించాడు.

ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్టు సిరిస్‌లో కోహ్లీ... అజారుద్దీన్ రికార్డుని మిస్ అయినప్పటికీ ఆ తర్వాత స్వదేశంలో జరగబోయే టెస్టు సిరిస్‌లో అధిగమించే ఛాన్స్ ఉంది. ఇంగ్లాండ్ పర్యటన తర్వాత భారత్ లో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు రానుంది.

ఆస్ట్రేలియా పర్యనట తర్వాత బంగ్లాదేశ్ ఒక టెస్టు మ్యాచ్ ఆడేందుకు భారత్‌లో పర్యటించనుంది. ఇదిలా ఉంటే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఇంగ్లాండ్‌ను 5-0తో వైట్ వాష్ చేసే సత్తా టీమిండియాకు ఉందని అన్నాడు.

భారత జట్టుకు అత్యధిక టెస్టు విజయాలను అందించిన కెప్టెన్లు (టాప్ 5)
27 (60 matches) - మహేంద్ర సింగ్ ధోని
21 (49) - సౌరభ్ గంగూలీ
14 (47) - మహమ్మద్ అజారుద్దీన్
10 (17) - విరాట్ కోహ్లీ 9 - సునీల్ గవాస్కర్ (47), మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ (40)
8 (25) - రాహుల్ ద్రవిడ్

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+