For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'భాగ్య నగరంలో భారత స్టార్ క్రికెటర్ల సందడి'

Chance for hopefuls and comeback players

హైదరాబాద్: దేశవాళీ క్రికెట్‌ టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా గ్రూప్‌ 'డి' మ్యాచ్‌లకు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో నగరంలో ఆడేందుకు అంతర్జాతీయ స్థాయి భారత ఆటగాళ్లు నగరానికి విచ్చేశారు. ఈ గ్రూప్‌లో ఆతిథ్య హైదరాబాద్‌తో పాటు విదర్భ, సర్వీసెస్, ఛత్తీస్‌గఢ్, సౌరాష్ట్ర, జార్ఖండ్, జమ్మూకశ్మీర్‌ జట్లు బరిలో దిగనున్నాయి.

ఈ టోర్నీ సోమవారం 5వ తేదీ నుంచి ఫిబ్రవరి 14 వరకు జరుగనుంది. మొత్తం నాలుగు గ్రూపుల్లోని 28 జట్లు మొదట రౌండ్ రాబిన్‌లీగ్ మ్యాచుల్లో పాల్గొంటాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, నడున్, ధర్మశాల(హిమాచల్‌ప్రదేశ్), బిలాస్‌పూర్(ఛత్తీస్‌ఘఢ్), అలూరు, బెంగళూరు (కర్ణాటక), చెన్నై వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి.

ఈ నేపథ్యంలో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మొహమ్మద్‌ సిరాజ్, రవీంద్ర జడేజా, చతేశ్వర్‌ పుజారా, రాబిన్‌ ఉతప్ప, వసీమ్‌ జాఫర్, ఉమేశ్‌ యాదవ్, వరుణ్‌ అరోన్, జైదేవ్‌ ఉనాద్కట్‌లతో పాటు పర్వేజ్‌ రసూల్, ఇషాన్‌ కిషన్, సౌరవ్ తివారి, అనుకూల్‌ రాయ్, ఫైజ్‌ ఫజల్, రజనీశ్‌ గుర్బానీ ఆయా రాష్ట్ర జట్ల తరఫున బరిలోకి దిగనున్నారు.

తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు సర్వీసెస్‌తో తలపడనుంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సోమవారం జరుగనున్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు అక్షత్‌ రెడ్డి సారథ్యం వహించనున్నాడు. సిరాజ్, ప్రజ్ఞాన్‌ ఓజా, ఆశిష్‌ రెడ్డి, ఆకాశ్‌ భండారి, మెహదీ హసన్, రవితేజ, సుమంత్‌ కొల్లాలతో హైదరాబాద్‌ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది.

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీ వివాదం నేపథ్యంలో స్టార్‌ ప్లేయర్‌ అంబటి రాయుడుపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించడంతో అతను అందుబాటులో లేకుండా పోయాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, February 5, 2018, 12:26 [IST]
Other articles published on Feb 5, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+