ముంబయి: ఐసిసి ప్రపంచ ట్వంటీ 20 ఛాంపియన్ షిప్ పోటీలకు భారత క్రికెట్ జట్టు మేనేజర్ గా ఆంధ్రప్రదేశ్ మాజీ బ్యాట్స్ మన్ చాముండేశ్వరీనాథ్ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) నియమించింది. ప్రపంచ ట్వంటీ 20 ఛాంపియన్ షిప్ పోటీలు జూన్ 5 నుంతి 21వ తేదీ వరకు ఇంగ్లాండులో జరుగుతున్న విషయం తెలిసిందే. జట్టు మీడియా మేనేజర్ గా అనిరుధ్ చౌదరి వ్యవహరిస్తారని బిసిసిఐ కార్యదర్శి ఎన్. శ్రీనివాసన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. కోచ్ గా గ్యారీ క్రిస్టన్, బౌలింగ్ కోచ్ గా వెంకటేష్ ప్రసాద్ వ్యవహరిస్తారు.
సపోర్టు స్టాఫ్: వి చాముండేశ్వరీనాథ్ - అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, అనిరుధ్ చౌదరి - మీడియా మేనేజర్, గారీ కిర్స్టన్ - కోచ్, వెంకటేష్ ప్రసాద్ - బౌలింగ్ కోచ్, రాబిన్ సింగ్ - ఫీల్డింగ్ కోచ్, నితిన్ పటేల్ - ఫిజియోథెరిపిస్టు, పాడి ఉప్టన్ - పిసిఎంఎస్ కోచ్, సికెహం ధనంజయ్ - వీడియో అనలిస్ట్, రమేష్ మనే - మాసియర్, రస్సెల్ రాధాకృష్ణన్ - ట్రావెల్ అసిస్టెంట్.