IND VS BAN: 87 సెకన్లలో రవీంద్ర జడేజా రికార్డ్!.. ధోనీ, కోహ్లీ సరసన చోటు
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ జడేజా అరుదైన రికార్డ్ సాధించాడు. తద్వారా దిగ్గజ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ సరసన చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతోన్న మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి ఈ ఘనత అందుకున్నాడు.
మూడో ప్లేయర్ గా ఘనత...
జడేజా.. అంతర్జాతీయ క్రికెట్ లో 200 వన్డే మ్యాచులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఎక్కువ ఐసీసీ ఈవెంట్లలో పాల్గొన అతడు, 200 వన్డే మ్యాచులకు పైగా ఆడిన మూజో క్రికెటర్ గా(యాక్టివ్ ప్లేయర్స్ లోః నిలిచాడు. విరాట్ కహ్లీ 298 వన్డే మ్యాచులు, రోహిత్ శర్మ 269 మ్యాచులు ఆడాడు. ఓవరాల్ గా ఈ జాబితాలో సచిన్ తెందుల్కర్ 463 మ్యాచులతో అగ్రస్థానంలో ఉండగా, ధోనీ 347, రాహుల్ ద్రవిడ్ 340, మహ్మద్ అజారుద్దీన్ 334, గంగూలీ 308, యువరాజ్ సింగ్ 301 మ్యాచులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక ఇదే మ్యాచ్ లో మెరుపు వేగంతో 87 సెకన్లలోనే ఓవర్ పూర్తి చేసిన ఆటగాడిగానూ నిలిచాడు జడేజా.

జడేజా కెరీర్..
జడేజా 2008 అండర్ 19 వరల్డ్ కప్ గెలిచాక, 2009లో తన వన్డే అరంగేట్రాన్ని చేశాడు. అది జరిగిన 2 రోజులకే టీ20ల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. 2012లో ఇంగ్లాండ్ పై తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 2011 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లో అతడు భాగం కాకపోయినప్పటికీ.. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలకంగా వ్యవహరించాడు. అలానే 2024 విజేతగా నిలిచిన టీమిండియాలోనూ భాగస్వామ్యమయ్యాడు. ఆ తర్వాత టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కేవలం టెస్టులు, వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఇప్పటివరకు అతడు కెరీర్ లో 80 టెస్టులు, 200 వన్డేలు, 74 టీ20లు ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications