Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'భారత్‌పై ఆ ఒక్క విజయం పాక్ ఆటతీరుని సమూలంగా మార్చింది'

Champions Trophy win has changed outlook of Pakistan: Aamer Sohail

హైదరాబాద్: గతేడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాను ఓడించడంతో పాకిస్థాన్‌ ఆటతీరు సమూలంగా మారిపోయిందని ఆ దేశ మాజీ క్రికెటర్ అమీర్ సోహైల్ అభిప్రాయపడ్డాడు. సెప్టెంబర్ 15 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆసియా కప్‌లో ఆడేందుకు పాకిస్థాన్ టీమ్ అక్కడికి చేరుకుంది. ఈ సందర్భంగా అమీర్ సోహైల్ మాట్లాడుతూ "ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలవడంతో పాకిస్థాన్ టీమ్ ఆటతీరే పూర్తిగా మారిపోయింది. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌‌‌‌ జట్టుని చక్కగా సమన్వయం చేసుకుంటూ నడిపిస్తున్నాడు" అని అన్నాడు.

"అలానే క్రికెటర్లు కూడా కోచ్, సహాయ సిబ్బందికి సహకరిస్తున్నారు. ప్రతిష్టాత్మక టోర్నీలో ఎలా ఆడాలో పాక్ ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీ ద్వారా తెలుసుకున్నారు" అని సోహైల్ వెల్లడించాడు. ఆసియా కప్‌ టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 16న క్వాలిఫయర్ జట్టుతో తొలి మ్యాచ్‌ని పాకిస్థాన్ జట్టు ఆడనుంది. ఆ తర్వాత టీమిండియాతో సెప్టెంబర్ 19న భారత్‌తో పాక్ తలపడనుంది.

దాదాపు ఏడాది తర్వాత మళ్లీ భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండటంతో టోర్నీలోనే ఈ మ్యాచ్‌ని హై ఓల్టేజ్ మ్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, ఒక క్వాలిఫయర్ జట్టు పోటీపడనున్నాయి. ఆసియా కప్ టోర్నీలో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో రోహిత్‌ శర్మ భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

ఆసియా కప్‌లో ఆడే పాకిస్థాన్ జట్టు:
సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్), ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, షాన్ మసూద్, బాబర్ అజామ్, షోయబ్ మాలిక్, అసిఫ్ అలీ, హారీస్ సోహాలి, సదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, అష్రప్, హసన్ అలీ, మహ్మద్ అమీర్, జునైద్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, షాహీన్ షా అఫ్రిది

Story first published: Monday, September 10, 2018, 9:20 [IST]
Other articles published on Sep 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+