భారత్-పాక్ మ్యాచ్ హైలెట్స్: ఆన్‌లైన్, టీవీలో ఎక్కడ చూడొచ్చంటే!
హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఎడ్జిబాస్టన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 124 పరుగుల తేడా (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి)తో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ , ఫోటోలు , స్కోరు కార్డు
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 48 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. అనంతరం మ్యాచ్‌కి వర్షం పలుమార్లు అంతరాయం కలిగించిన నేపథ్యంలో పాక్ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 289 పరుగులుగా నిర్దేశించారు.

అయితే ఛేదనలో పాకిస్థాన్.. భారత బౌలర్ల ధాటికి 33.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఆటగాళ్లలో అజర్ అలీ (65 బంతుల్లో 6 ఫోర్లతో 50), మహ్మద్ హఫీజ్ (33) మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ మూడు, రవీంద్ర జేజా, హార్దిక్ పాండ్యా రెండేసి వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్ భారత అభిమానులకు మాత్రం తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. పాకిస్థాన్ బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్ చీల్చి చెండాడారు. ఆ తర్వాత పాక్ బ్యాట్స్ మెన్లను టీమిండియా బౌలర్లు కట్టడి చేసిన విధానం అద్భుతం. ఓవరాల్‌గా మ్యాచ్ మొత్తం విరాట్ సేనదే ఆధిపత్యం.
మ్యాచ్ ప్రారంభం నుంచి కూడా టీమిండియా, పాక్‌పై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు ఓపెనింగ్‌కు సెంచరీ భాగస్వామ్యంతో అరుదైన రికార్డుని సైతం నెలకొల్పారు. ఈ మ్యాచ్ మిస్సయ్యామని ఫీలవుతున్నా ఫ్యాన్స్ ఆన్ లైన్‌లో సోమవారం (జూన్ 5)న హైలెట్స్ చూడొచ్చు.
Hotstar
Star Sports 1 - 9:30 AM, 12:30 PM and 4:30 PM (IST)
Star Sports 2 - 10:00 AM, 2:00 PM, 7:30 PM and 11:30 PM (IST)
Star Sports HD1 - 12:30 PM, 4:30 PM (IST)
Star Sports HD2 - 2:00 PM, 7:30 PM, 11:30 PM (IST)
Star Sports Hindi 1 - 1:00 PM, 4:00 PM (IST)
Star Sports Hindi HD1 - 1:00 PM, 4:00 PM (IST)
అలాగే తన విధ్వంసక ఆటతీరుతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన యువరాజ్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. యువీ చివరి ఓవర్లలో పాక్ బౌలర్లను ఎలా చితకబాదాడో ఇక్కడ మీరు చూడొచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications