టీమిండియా డిన్నర్ పార్టీ: లండన్ చేరుకున్న రోహిత్ శర్మ
హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహాలను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. అసలు పోరుకు ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రదర్శన చేసింది. పేసర్లు విజృంభించడంతో ఆదివారం జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో న్యూజిలాండ్‌పై 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ వర్ష ప్రభావిత మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 38.4 ఓవర్లలో 189 పరుగులకు కుప్పకూలింది. స్వల్ప లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కోహ్లి, ఓపెనర్ శిఖర్ ధావన్ కీలక ఇన్నింగ్స్ ఆడారు.
ఈ క్రమంలో 26 ఓవర్లలో 3 వికెట్లకు 129 పరుగులు చేసిన సమయంలో భారీ వర్షం కురవడంతో అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత కూడా వర్షం తగ్గలేదు. అప్పటికి డకవర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ విజయం ఖాయం కావడానికి 26 ఓవర్లలో 84 పరుగులుగా ఉంది.
టీమిండియా అంతకంటే ఎక్కువ పరుగులు చేయడంతో భారత్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. మంగళవారం జరిగే రెండో వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ ఆడుతుంది. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా డిన్నర్ పార్టీ చేసుకుంది.
ఈ డిన్నర్‌కి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పేసర్ ఉమేశ్ యాదవ్ అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫోటోలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ధోని, బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లతో పాటు బ్యాట్స్ మెన్లు కేదార్ జాదవ్, రహానేలను చూడొచ్చు.
సోషల్ మీడియాలో షేర్ చేసిన ఉమేశ్ యాదవ్
న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్ అనంతరం టీమిండియా డిన్నర్ పార్టీ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను పేసర్ ఉమేశ్ యాదవ్ అభిమానులతో పంచుకున్నాడు.
విరాట్ కోహ్లీ సైతం
జట్టు సహచరులతో కలిసి డిన్నర్ చేసిన ఫోటోలను అభిమానులతో పంచుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.
శిఖర్ ధావన్
జట్టు సహచరుతలో కలిసి స్టేడియానికి వెళ్తున్న సందర్భంలో ఫోటోను తీసి ఇనిస్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఓపెనర్ శిఖర్ ధావన్.
యువరాజ్ సింగ్
జ్వరం కారణంగా యువీ వార్మప్ మ్యాచ్ ఆడలేదు.
జ్వరం కారణంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌కి టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ దూరమయ్యాడు. అయితే ఇనిస్టాగ్రామ్‌లో త్రీ మిలియన్ ఫాలోవర్లు అయినందుకు ధన్యవాదాలు తెలిపాడు.
లండన్ చేరుకున్న రోహిత్ శర్మ
రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం లండన్ చేరుకున్నాడు. గత వారం కోహ్లీ సేన ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరే జట్టులో రోహిత్, కేదార్ జాదవ్‌లు లేని సంగతి తెలిసిందే. బంధువుల ఇంట్లో వివాహానికి హాజరు కావడం కోసం రోహిత్ బీసీసీఐ నుంచి అనుమతి తీసుకున్నాడు. కేదార్‌కు వీసా సమస్య రావడంతో అతను వెళ్లలేకపోయాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఆదివారం లండన్ బయలుదేరినట్లు తన ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications