ఛాంపియన్స్ ట్రోఫీ మాదే: స్టీవ్ స్మిత్ ధీమా (ఫోటోలు)
హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ టైటిలే లక్ష్యంగా ఆడుతామని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. అంతేకాదు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే అవకాశాలు తమకే ఉన్నాయని స్టీవ్ స్మిత్ ధీమా వ్యక్తం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ పర్యటనలో భాగంగా బుధవారం స్మిత్ మీడియాతో మాట్లాడాడు.
ఐపీఎల్ కోసం గత రెండు నెలలుగా భారత్‌లో ఉండటం సంతోషాన్ని ఇచ్చిందని, ఈ టోర్నమెంట్‌ను అస్వాదించామని స్మిత్ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ క్రికెట్‌కు అనువైన ప్రదేశమని, ఇక్కడ ఆటగాళ్ల సత్తా బయటకు వస్తుందని స్మిత్ చెప్పాడు. గత కొద్ది రోజులుగా తాము తీరిక లేకుండా గడిపామని అయినా శారీరకంగా, మానసికంగా దృడంగా ఉన్నామని పేర్కొన్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ మాకు చాలా ముఖ్యం
ఛాంపియన్స్ ట్రోఫీ మాకు చాలా ముఖ్యమైందని, ఈ మధ్య కాలంలో తమ విజయాలకు కొంత బ్రేక్ వచ్చినప్పటికీ, టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతామని చెప్పాడు. చాంపియన్స్ ట్రోఫిలో ఆసీస్‌కు మంచి రికార్డు ఉందని, దానిని ఇలానే కొనసాగిస్తామని స్మిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. గెలుపే మాకు కావలి దాని కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తారని దాని పైనే మా దృష్టంతా ఉంటుందని వ్యాఖ్యానించాడు.

ఆ ఓటమి మాపై ప్రభావం చూపదు
ఈ సీరిస్‌కు ముందు భారత్‌తో టెస్టు సిరీస్, ఐపీఎల్ మినహా వన్డేలు ఆడలేదని, ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ చివరిదని స్మిత్ తెలిపాడు. ఈ సిరీస్‌లో 2-0 ఓడిపోయిన దాని ప్రభావం మా పై ఉండదని, చాంపియన్స్ ట్రోఫికి ముందే జరిగే వార్మప్ మ్యాచ్‌లను ఉపయోగించుకుంటామన్నాడు.

ఆసీస్‌కు మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది
ఆసీస్‌కు మంచి బ్యాటింగ్ లైనప్ ఉందని, ఇక్కడ ఇంతకు ముందు రాణించిన ఆటగాళ్లు జట్టులో ఉన్నారని, కచ్చితంగా టైటిల్ గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఛాంపియన్స్ టోర్నీలో
పాల్గొనే జట్లు అన్ని కూడా బలంగా ఉన్నాయని స్మిత్ అభిప్రాయపడ్డాడు.

శ్రీలంకతో తొలి వార్మప్ మ్యాచ్
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ది ఓవల్ మైదానంలో శ్రీలంకతో ఆస్ట్రేలియా తన తొలి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి తలపడుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ వేదికగా జూన్ 1 నుంచి 18 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications