భారత్ Vs లంక: దూకుడుగా ఆడాల్సిందే, సంగక్కర హెచ్చరిక
హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం భారత్‌తో జరగనున్న మ్యాచ్‌లో శ్రీలంక ఆటతీరు దూకుడుగా ఉండాల్సిందేనని మాజీ కెప్టెన్ కుమార సంగక్కర సూచించాడు. మంగళవారం ఐసీసీకి రాసిన కాలమ్‌లో భారత్-శ్రీలంక మ్యాచ్ గురించి తన అభిప్రాయాలను సంగక్కర అభిమానులతో పంచుకున్నాడు.
'ప్రస్తుతం యువకులతో కూడిన శ్రీలంక జట్టును నేను ఇష్టపడుతున్నాను. పాక్‌పై విజయం సాధించి మంచి ఊపు మీదున్న భారత్‌పై గెలవాలంటే అంత సులువేమీ కాదు. అటు మాథ్యూస్ ఆడేది అనుమానంగా ఉండటంతో పాటు తాత్కాలిక కెప్టెన్ ఉపుల్ తరంగపై నిషేధం ఉండడం జట్టును ఇబ్బంది పెట్టేదే' అని సంగక్కర అన్నాడు.

తొలి మ్యాచ్‌లో లంక ఓటమి
టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఓటమిపాలైంది. దీంతో సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే టీమిండియాపై కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక, దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటుకు కారణమైన శ్రీలంక బౌలర్లను సంగక్కర తప్పుబట్టాడు.

స్లో ఓవర్ రేటు కారణంగా ఉపుల్ తరంగపై నిషేధం
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా లంక తాత్కలిక కెప్టెన్ ఉపుల్ తరంగపై ఐసీసీ రెండు మ్యాచ్‌లు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. సీనియర్ బౌలర్లు ఉన్న స్లో ఓవర్ రేటు ఎందుకు వేయాల్సి వచ్చిందో అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

39 నిమిషాలు మ్యాచ్ ఆలస్యం
సీనియర్ బౌలర్ లసిత్ మలింగ, మరో ఇద్దరూ స్సిన్నర్లు ఉన్నా 39 నిమిషాలు మ్యాచ్ ఆలస్యం కావడం ఆహ్వానించదగిన విషయం కాదని సంగక్కర అభిప్రాయ పడ్డాడు. మ్యాచ్ వేగంగా జరిగేందుకు వికెట్ కీపర్, ఫీల్డర్లు కూడా భాగమవ్వాలని ఈ సందర్భంగా సూచించాడు.

భారత్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదు
పాక్‌పై విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న భారత్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదని సంగక్కర అన్నాడు. భారత్‌పై గెలవాలంటే 10 ఓవర్లలోపే వికెట్లు తీయాలని అన్నాడు. ఇక భారత్ బౌలింగ్‌కు అప్రమత్తంగా ఉండాలని, ఈ మధ్య కాలంలో భారత్ బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారని సంగక్కర హెచ్చరించాడు.

పేస్ విభాగం పటిష్టంగా ఉంది, స్పిన్ అదనపు బలం
ముఖ్యంగా పేస్ విభాగం పటిష్టంగా ఉందని, ఇక స్పిన్ వారి అదనపు బలమని చెప్పాడు. ఉపుల్ తరంగపై నిషేదం, కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ ఫిట్‌నెస్‌పై సందిగ్థత నెలకోవడంతో శ్రీలంకకు సానుకూల పరస్థితులు కనబడటం లేదని సంగక్కర పేర్కొన్నాడు. గురువారం భారత్‌తో జరిగే మ్యాచ్ లంకకు చావో రేవో అన్నట్లుగా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications