ఆసక్తికరంగా సెమీస్: వర్షంతో భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దు అయితే?
హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన టీమిండియాపై శ్రీలంక విజయం సాధించడంతో సెమీ ఫైనల్ ఆసక్తికరంగా మారింది. గురువారం ది ఓవల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా... శ్రీలంక చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 321 పరుగులు చేసింది. దీంతో శ్రీలంకకు 322 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం 322 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 48.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేధించింది.
ఛేదనకు దిగిన శ్రీలంకను కట్టడి చేయడంతో బౌలర్లు విఫలమయ్యారు. శ్రీలంక ఓపెనర్ గుణతిలక (76; 72 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులు), కుశాల్ మెండిస్ (89; 93 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సు) అర్ధ సెంచరీలతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

గ్రూప్ బీలోని అన్ని జట్లు తలో మ్యాచ్ నెగ్గాయి
తాజాగా శ్రీలంక విజయం సాధించండంతో గ్రూప్ బిలో భాగంగా భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు తలో మ్యాచ్ నెగ్గడంతో.. ఇంకో మ్యాచ్ నెగ్గిన రెండు జట్లు సెమీస్ చేరతాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్‌కు పోరు రసవత్తరంగా మారింది. భారత్ తమ చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

చావో రేవోగా మారిన మిగతా రెండు మ్యాచ్‌లు
కాగా, గ్రూప్ బీలో భాగంగా జరగాల్సిన రెండు మ్యాచ్‌లు ఆయా జట్లకు చావో రేవోగా మారాయి. టోర్నీలో భాగంగా జూన్ 11 (ఆదివారం)న భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా, జూన్ 12 (సోమవారం) పాకిస్థాన్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి.

గ్రూప్ స్టేజికి సోమవారం చివరి రోజు
గ్రూప్ స్టేజిలో భాగంగా జరిగే మ్యాచ్‌లకు సోమవారం చివరి రోజు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా మిగతా మూడు జట్లతో పోలిస్తే మెరుగైన రన్ రేట్‌ను కలిగి ఉంది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే భారత్ 3 పాయింట్లతో సెమీస్‌కు అర్హత సాధిస్తుంది.

వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే
అదే విధంగా పాకిస్థాన్-శ్రీలంక జట్ల మధ్య జరిగే మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు అయితే దక్షిణాఫ్రికాకు ఎంతో మేలు చేస్తోంది. ఎందుకంటే పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో ఉన్న దక్షిణాఫ్రికా సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. గ్రూబ్ బీలో భారత్ 2 పాయింట్లతో పాటు +1.272 నెట్ రన్ రేట్‌తో అగ్రస్ధానంలో ఉంది.

మిగతా మూడు జట్లూ 2 పాయింట్లతో
మరోవైపు మిగతా మూడు జట్లు కూడా 2 పాయింట్లతో కొనసాగుతున్నప్పటికీ నెట్ రన్ రేట్‌లో వెనుకబడి ఉన్నాయి. దక్షిణాఫ్రికా +1.000 రన్ రేట్‌తో కొనసాగుతుండగా, శ్రీలంక -0.879 ఆ తర్వాత పాకిస్థాన్ -1.544తో కొనసాగుతోంది. అయితే ఈ రెండు మ్యాచ్‌ల్లో ఫలితం వస్తే మాత్రం ఈ నెట్ రన్ రేట్ లెక్కలు అవసరం లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications