న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్: 30సెకన్ల యాడ్‌కే రూ. కోటి, పంట పండినట్లే..!

భారత్-పాక్ మ్యాచ్ అంటేనే ఈ రెండు దేశాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు వీక్షిస్తారు.

By Staff

లండన్: భారత్-పాక్ మ్యాచ్ అంటేనే ఈ రెండు దేశాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు వీక్షిస్తారు. అదే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఈ రెండు దాయాది దేశాలు తలపడుతున్నాయాంటే ఆ ఫీవర్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో దాయాది దేశాల ఫైనల్ మ్యాచ్‌కు వచ్చే ప్రకటనలకు భారీగా రేట్లు పెంచేశాయి టీవీ సంస్థలు.

ఆదివారం జరిగే భారత్-పాక్ మ్యాచ్ విరామ సందర్భాల్లో వచ్చే ప్రకలనకు 30 సెకన్లకే ఏకంగా కోటి రూపాయలు వసూలు చేస్తుండటం గమనార్హం. 2007లో జరిగిన ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో తలబడిన భారత్-పాక్.. పదేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి తలపడుతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. దక్షిణాఫ్రికాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 5వికెట్ల తేడాతో గెలిచి ప్రపంచ టీ20 ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది.

Champions Trophy: Rs 1 crore for 30-second TV ad during India-Pakistan final

ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను భారత్, పాక్ అభిమానులతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది క్రికెట్ అభిమానులు టీవీల్లో వీక్షించనున్నారు. రేటింగ్ కూడా అమాంతంగా పెరిగే అకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సెకన్ల టీవీ ప్రకటనలకే కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు.

జూన్ 4న గ్రూప్ దశలో ఈ జట్లు తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో డక్ వర్త్ లూయీస్ పద్ధతిలో భారత్ 124 పరుగుల తేడాతో గెలుపొందింది. రూటర్స్ కథనం ప్రకారం.. భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ ప్రకటనల రేట్లను ఒకేసారి పది రేట్లు పెంచేసింది. దీంతో మ్యాచ్ సందర్భంగా యాడ్ ఇవ్వాలనుకుంటే ప్రకటనదారులు 30సెకన్లకే దాదాపు కోటి రూపాయలు చెల్లించక తప్పదన్నమాట.


ఈ మ్యాచ్‌ సందర్భంగా వచ్చే ప్రకటనలతో టీవీ సంస్థలు కోట్లలో ఆర్జించనున్నాయి. కాగా, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు భారత్-పాక్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారని మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ మైకేల్ వా తెలిపాడు. ఈ మ్యాచ్‌లో ఫెవరేట్ భారత్ అని అన్నాడు.
Story first published: Wednesday, November 15, 2017, 10:56 [IST]
Other articles published on Nov 15, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X