
ఆసీస్-బంగ్లా మ్యాచ్‌కి వర్షం అంతరాయం
ఆస్ట్రేలియా విజయానికి ఇంకా నాలుగు ఓవర్లు అవసరమయ్యాయి. అయినా సరే వర్షం తగ్గకపోవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఇక టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో
న్యూజిలాండ్ గెలిచే స్థితిలో ఉండగా వర్షం అడ్డంకిగా మారి ఆ జట్టుకు నిరాశ మిగిల్చాడు.

సర్వత్రా విమర్శలు
ఇలా వర్షం కారణంగా ఛాంపియన్స్ టోర్నీపైనే అభిమానుల ఆసక్తి సన్నగిల్లిపోయే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకదు ఇంగ్లాండ్‌లో వర్షాలు పడే సమయంలో ఈ టోర్నీని షెడ్యూల్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నుంచి 18 వరకు జరగనుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో కలిసిపోవడం ఖాయం
టోర్నీలో రాబోయే రోజుల్లో కూడా వర్షం ప్రభావం ఇలాగే కొనసాగితే.. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో కలిసిపోవడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి వరుణుడు అంతరాయం కలిగించడం ఇదే తొలిసారి కాదు. 2002లో శ్రీలంక వేదికగా జరిగిన టోర్నీలో కూడా వర్షం దెబ్బ తీసింది.

గతంలో కూడా ఇలా
అప్పుడు కూడా ఫైనల్ మ్యాచ్ రెండుసార్లు రద్దు అయింది. రిజర్వ్ డే నాడూ వర్షం పడటంతో మ్యాచ్ జరగలేదు. దీంతో ఆనాడు ఫైనల్‌లో తలపడిన భారత్, శ్రీలంక జట్లను సంయుక్త విజేతలుగా నిలిచాయి. ఇక 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా వరుణుడు ఇలాగే ఇబ్బంది పెట్టాడు.

ఛాంపియన్స్ ట్రోఫీకి వర్షం పెను ప్రభావం
ఇంగ్లాండ్, టీమిండియా జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. పైనల్ మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారడంతో పైనల్ మ్యాచ్‌ని టీ20 ఓవర్లకు కుదించారు. ఈ పైనల్‌లో ఇంగ్లాండ్‌పై టీమిండియా విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. తాజాగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీకి వర్షం దెబ్బ తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది.


Click it and Unblock the Notifications











