లండన్‌లో కోహ్లీ ఛారిటీ బాల్ ఈవెంట్: హాజరైన సచిన్ (ఫోటోలు)
హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ప్రస్తుతం టీమిండియా లండన్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జస్టిస్ అండ్ కేర్ అనే ఆర్గనైజేషన్ కోసం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లండన్‌లో ఛారిటీ బాల్ అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
ఈ ఛారిటీ బాల్ కార్యక్రమానికి కెప్టెన్ కోహ్లీతో పాటు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, అశ్విన్, శిఖర్ ధావన్, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్‌లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్ కూడా హాజరయ్యారు. ఈ ఛారిటీ ఈవెంట్‌ని అలాన్ విల్కిన్స్ నిర్వహించాడు.
ఈ కార్యక్రమం వ్యాఖ్యతగా ఐర్లాండ్ అంతర్జాతీయ క్రికెటర్ నిఆల్ ఓ బ్రెయిన్ వ్యవహరించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, క్రికెట్ లెజెండ్ సచిన్ టండూల్కర్ తమ అనుభవాలను ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. జస్టిస్ అండ్ కేర్ అనే సంస్ధ భారత్‌లో విరాట్ కోహ్లీ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తోంది.
విరాట్ కోహ్లీ ఛారిటీ బాల్ కార్యక్రమానికి సంబంధించి కొన్ని ఫోటోలు మీ కోసం:
విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్
లండన్‌లో విరాట్ కోహ్లీ ఛారిటీ బాల్ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్.

రోహిత్, యువరాజ్, ధావన్
లండన్‌లో విరాట్ కోహ్లీ ఛారిటీ బాల్ కార్యక్రమంలో తన భార్యతో కలిసి పాల్గొన్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, పక్కనే యువరాజ్ సింగ్, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ లను చూడొచ్చు.
కోహ్లీ ఫండ్ రైజింగ్ కార్యక్రమం అద్భుతం
లండన్‌లో విరాట్ కోహ్లీ ఛారిటీ బాల్ కార్యక్రమంలో భార్యతో కలిసి పాల్గొన్న శిఖర్ ధావన్. పక్కనే భార్యతో రోహిత్ శర్మ.
ట్విట్టర్‌లో రవిచంద్రన్ అశ్విన్
లండన్‌లో విరాట్ కోహ్లీ ఛారిటీ బాల్ కార్యక్రమంలో పాల్గొన్న టీమిండియా క్రికెటర్లు అశ్విన్, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్.
ఇషా గుహ
లండన్‌లో విరాట్ కోహ్లీ ఛారిటీ బాల్ కార్యక్రమానికి సంబంధించి ఫోటోను ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఇంగ్లాండ్ మాజీ మహిళా క్రికెటర్ ఇషా గుహ.
నిఆల్ ఓ బ్రైయిన్
లండన్‌లో విరాట్ కోహ్లీ ఛారిటీ బాల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఐర్లాండ్ అంతర్జాతీయ క్రికెటర్ నిఆల్ ఓ బ్రైయిన్ వ్వవహరించారు. పై చిత్రంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మాట్లాడటాన్ని మీరు చూడొచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications