Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముందే హెచ్చరించిన సెహ్వాగ్: విన్లేదు, టీవీలు పగలగొట్టారు

హైదరాబాద్: భారత్-పాక్ మ్యాచ్ అంటే యావత్ ప్రపంచంలోని క్రికెట్ అభిమానులకు ఎంతో ఆసక్తి. దాయాదిదేశాలైన భారత్, పాక్‌ల మధ్య గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సిరిస్‌లు జరగడం లేదు. అయితే ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు పోటీ పడుతున్నాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

అలాంటి భారత్-పాక్ మ్యాచ్‌కి ఉండే ప్రాధాన్యత క్రికెట్ అభిమానులకు చెప్పాల్సిన పనిలేదు. మ్యాచ్‌ ఫలితం రాగానే అప్పటి వరకు మద్దతిచ్చిన అభిమానుల తీరు ఒక్కసారిగా మారిపోతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుకి మద్దతుగా ఉన్న అభిమానులు సంబరాలు చేసుకుంటారు.

ఓడిపోయిన జట్టు అభిమానులు అసహనాన్ని వ్యక్తం చేస్తూ.. ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటారు. అంతేకాదు ఓడిపోయిన కోపంలో చేతికి ఏది అందితే దానిని విసిరికొడుతూ ఉంటారు. తాజాగా ఐసీసీ టోర్నీలో భాగంగా ఆదివారం ఎడ్జిబాస్టన్ వేదికగా భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

ప్రత్యేక పూజలు

ప్రత్యేక పూజలు

ఈ మ్యాచ్‌లో మా జట్టు గెలవాలంటే మా జట్టు గెలవాలంటూ మ్యాచ్‌కి ముందు ఇరు జట్లకు చెందిన అభిమానులు ప్రత్యేక పూజలు కూడా చేసిన సంగతి తెలిసిందే. అయితే భారత్ చేతిలో టీమిండియా 124 పరుగుల తేడాతో చిత్తుగా ఓటమి పాలైంది. దీంతో భావోద్వేగానికి గురైన పాక్ అభిమానులు మ్యాచ్‌ వీక్షించిన టీవీలను పగలకొట్టేశారు.

 ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం మామూలే

ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం మామూలే

ఐసీసీ టోర్నీల్లో టీమిండియాపై పాక్‌ ఎప్పుడు ఓడిపోయినా అక్కడ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం అక్కడ మామూలే. ఈ మ్యాచ్‌కి ముందు ఇలా జరుగుతుందని ముందే ఊహించిన టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కొద్ది రోజుల క్రితం పాక్‌ మాజీ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌తో త్వరలో జరిగే భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కోసం పాక్‌ అభిమానులు టీవీలకు బదులు రేడియోలు కొనుగోలు చేయాలని సూచించాడు.

పాక్ అభిమానులకు సెహ్వాగ్ సలహా

పాక్ అభిమానులకు సెహ్వాగ్ సలహా

పాకిస్థాన్‌ మాజీ ఫాస్ట్ బౌల‌ర్ షోయ‌బ్ అఖ్తర్‌తో కలిసి ఓ టెలివిజ‌న్ ఛాన‌ల్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పాకిస్థాన్ అభిమానులకు సెహ్వాగ్ ఓ సలహా ఇచ్చాడు. పాక్ అభిమానులు ఈ సారి టీవీలకు బదులు రేడియోలు కొనుగోలు చేయాలంటూ తనదైన శైలిలో సెహ్వాగ్ సలహా ఇచ్చాడు.

టీవీలను పగలగొట్టిన పాక్ అభిమానులు

టీవీలను పగలగొట్టిన పాక్ అభిమానులు

జూన్ 4న ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగే మ్యాచ్‌లో పాక్‌ ఓటమిపాలైన తర్వాత రేడియోలను పగలకొట్టొచ్చని దానివ‌ల్ల వారి జేబులకు పెద్ద స్థాయిలో నష్టం జరగదని సెహ్వాగ్ తనదైన శైలిలో చమత్కరించాడు. సెహ్వాగ్ చెప్పినట్లు పాక్ క్రికెట్ అభిమానులు రోడ్లపైకి వచ్చి తమ ఇళ్లలోని టీవీలను పగలగొట్టారు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+